Virat Kohli: లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన విరాట్ కోహ్లీ.. వీడియో చూడండి
IND vs BAN Odi Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (73) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం పెవిలియన్‌కు క్యూకట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IND vs BAN Odi Highlights: భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే భారత్ కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం విఫలమయ్యారు. షకీబుల్ అల్ హాసన్ ఐదు, ఎబాడోత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. షకీబ్ అల్ హసన్ బౌలంగ్‌లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. లిటన్ దాస్ క్యాచ్ పట్టగానే కోహ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
23 పరుగుల వద్ద శిఖర్ ధావన్ ఔట్ అవ్వగా.. విరాట్ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 15 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసి ఔటయ్యాడు. 11వ ఓవర్ నాలుగో బంతికి షకీబ్ బౌలింగ్‌లో కోహ్లీ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ లిటన్ దాస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
ఎన్నో అంచనాలతో తొలి వన్డేలో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్.. ముకుమ్మడిగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ కూడా క్రీజ్‌లో నిలబడకపోతే భారత్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (27), శిఖర్ ధావన్ (7), శ్రేయాస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19), షాబాద్ అహ్మాద్ (0), శార్దుల్ ఠాకూర్ (2) విఫలమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి