India Vs Bangladesh 1st Odi Score: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా విఫలమయ్యారు. 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (73) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శేయాస్ అయ్యర్ (24) మాత్రమే ఉన్నంతలో పర్వాలేదనిపించారు. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబుల్ అల్ హాసన్ ఐదు వికెట్లు తీయగా.. ఎబాడోత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీశాడు. 187 రన్స్ టార్గెట్‌తో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 23 పరుగులు మాత్రమే జోడించారు. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్‌ను ఔట్ చేసి మెహదీ హసన్ బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. మొదటి పవర్‌ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. రోహిత్ శర్మ వికెట్ రూపంలో భారత్‌కు రెండో దెబ్బ తగిలింది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిట్‌మ్యాన్‌ను షకీబ్ అల్ హసన్ పెవిలియన్‌కు పంపించాడు.
అనంతరం శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఈ జోడిని 20వ ఓవర్‌లో అబాడోత్ హుస్సేన్ విడదీశాడు. 24 పరుగులు చేసిన అయ్యర్‌ను ఔట్ చేసి కుదుకుంటున్న సమయంలో దెబ్బ తీశాడు. 23 ఓవర్లలో భారత్ 100 పరుగులు పూర్తయ్యాయి. ఆ తరువాత కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ 5వ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
షకీబ్ అల్ హసన్ 33వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్‌ను అవుట్ చేయడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సుందర్ 43 బంతుల్లో 19 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం షాబాజ్ అహ్మద్ ఖాతా తెరవకుండానే డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో 153 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిఆంది. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ను ఔట్ చేసి తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు షకీబ్. 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 9వ వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 178 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. చివరికి భారత్ 186 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: Rishabh Pant: వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. కారణం చెప్పిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Ind Vs Ban: చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం.. బంగ్లాకు ఈజీ టార్గెట్