IND vs BAN: టీ20 ప్రపంచకప్ గెలవడానికి రాలేదు.. భారత్‌ను ఓడించేందుకే వచ్చాం! బంగ్లాదేశ్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shakib Al Hasan says We came to defeat India, Did not come to win T20 World Cup 2022. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు రాలేదని, భారత్‌ను ఓడించేందుకే వచ్చిందని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
Shakib Al Hasan says Bangladesh did not come to win T20 World Cup 2022, We came to defeat India: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఆడిలైడ్ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతుంది. మరోవైపు బంగ్లాకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం టీమిండియాతో సమానంగా పాయింట్స్ ఉన్న బంగ్లా.. భారత్‌పై గెలిస్తే సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్‌ను గెలుచుకునే ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంగీకరించాడు. బంగ్లాదేశ్ ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు రాలేదని.. టైటిల్ ఫేవరెట్ అయిన భారత్‌ను దెబ్బతీసేందుకే వచ్చామన్నాడు. భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ఈ విషయం ఇదివరకే చెప్పాను, మరోసారి చెపుతున్నా. టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి. ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు భారత్ వచ్చింది. మేము టైటిల్ ఫేవరెట్ కాదు, ప్రపంచకప్ గెలవడానికి ఇక్కడకు రాలేదు' అని అన్నాడు.
'మేము భారత్‌పై గెలిస్తే.. కచ్చితంగా వారు అప్‌సెట్ అవుతారు. టీమిండియాపై మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాము కచ్చితంగా టీమిండియాను నిరాశపరిచేందుకు ప్రయత్నిస్తాము. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. టీమిండియాకు అతను నంబర్ 1 బ్యాటర్. సూర్య మాత్రమే కాదు చాలా మంది ప్రపంచ స్థాయి ప్లేయర్స్ భారత జట్టులో ఉన్నారు. భారత బ్యాటర్లను ఆపడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. మేము గెలవాలంటే టాప్ క్లాస్ ఆటగాళ్లను అడ్డుకోవాల్సి ఉంది' అని షకీబ్ అల్ హసన్ అన్నాడు.
బంగ్లాదేశ్ గతంలో 11 టీ 20ల్లో భారత్‌తో తలపడింది. అందులో 10 మ్యాచులు ఓడిపోయింది. టీమిండియాపై భారత్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. 2019లో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచులో బంగ్లా విజయం సాధించింది. రెండు జట్లు దాదాపు 3 సంవత్సరాలలో ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్ 2022లో బంగ్లాదేశ్ సూపర్ 4 దశకు చేరుకోకపోవడంతో.. ఇరు జట్లు తలపడలేదు.
Also Read: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Also Read: Mangal Vakri 2022: ఈ రాశులవారికి తల రాత మారబోతోంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook