IND vs ENG 4th Test Live Score: రాంచీ టెస్టులో తన జట్టు స్వల్పస్కోరుకే కుప్పకూలకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్. అతడి సెంచరీ కారణంగానే ఇంగ్లండ్ తొలి రోజు ఆలౌట్ అవ్వలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిప్పులు చెరిగిన ఆకాశ్..
వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్... కీలకమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు క్రాలే, బెన్ డకెట్ శుభరాంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 47 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన టీమిండియా యువ బౌలర్ ఆకాశ్‌ దీప్‌ నిప్పులు చెరిగాడు. మూడు ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లండ్ యెుక్క మూడు వికెట్లు తీసి ఆ జట్టుకు షాకిచ్చాడు. అతడు వేసిన పదో ఓవర్లో రెండో బంతికి బెన్‌ డకెట్‌(11), నాలుగో బంతికి ఓలీ పోప్(0) ఔటయ్యారు. 12 ఓవర్ ఐదో బంతికి క్రాలే(42) బౌల్డ్ అయ్యాడు. 


రూట్‌ మార్చిన రూట్‌..
అనంతరం 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 38 పరుగులు చేసిన జానీ బెయిర్‌ స్టోను అశ్విన్‌ పెవిలియన్ కు పంపించాడు. కాసేపటికే జట్టు కెప్టెన్ స్టోక్స్ ను జడేజా ఔట్ చేశాడు. మరోవైపు సహచరుల వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు రూట్. బెన్‌ ఫోక్స్‌తో కలిసి అద్భుత పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. బెన్‌ ఫోక్స్‌(47)తో పాటు టామ్‌ హర్ట్లీ ( 13)ని కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే రూట్(226 బంతులలో 106 నాటౌట్‌, 9 ఫోర్లు)  సెంచరీ చేశాడు. టెస్టులో ఇది 31వ సెంచరీ కావడం విశేషం. అనంతరం రూట్‌, రాబిన్సన్‌లు తొలి రోజు మరో వికెట్ ఇవ్వలేదు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 57 పరుగులను జోడించారు. 


Also Read: Akash Deep No Ball: ఇదేందయ్యా.. ఆకాశ్ దీప్ ఫస్ట్ వికెట్‌కే ఇలా జరిగింది.. అంపైర్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!  


Also Read: IPL 2024 schedule: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter