Ravichandran Ashwin Achieve Rare feat: టీమిండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin) మ‌రో ఘ‌న‌త సాధించాడు. రీసెంట్ గా 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్.. తాజాగా ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెయిర్ స్టో వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ జట్టుపై 23 టెస్టుల్లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. అంతేకాదు రెండు జట్ల మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా అతడే. మెుదటి స్థానంలో అండర్సన్ (139 వికెట్లు) ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రికార్డు ఒకటే కాదు మరో ఘనతను కూడా సాధించాడు అశ్విన్. వెయ్యి పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన ఏడోవాడు అశ్విన్, ఇంగ్లండ్ పై మాత్రం మూడోవాడు. రాంచీ టెస్టులో మరో రెండు వికెట్లు తీస్తే స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు ఆశ్విన్. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో (63 మ్యాచ్‌ల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ టెస్టు ద్వారా మరో రికార్డును కూడా అశ్విన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీస్తే.. కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్లు రికార్డును సమం చేస్తాడు 


Also Read: CSK IPL Schedule 2024: ధోని, కోహ్లీ మధ్యే తొలి మ్యాచ్.. చెన్నై షెడ్యూల్ ఇదే..!


మరోవైపు నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. భారత్ బౌలర్ల దెబ్బకు లంచలోపే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సీనియర్ ఆటగాడు రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. అతడికి బెన్ ఫోక్స్ చక్కటి సహకారం అందించారు. ప్రస్తుతం ఆ జట్టు 90 ఓవరల్లో ఏడు వికెట్లు నష్టానికి 302 పరుగులు చేసింది. రూట్ 106 పరుగులతోనూ, రాబిన్సన్ 31 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 


Also Read: IPL 2024 schedule: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter