IND Vs ENG World Cup 2023: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!
India Vs England World Cup 2023 Updates Toss and Playing 11: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
India Vs England World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్ కప్‌ల్ వరుస విజయాలతో జోరు మీదు ఉన్న టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో నేడు తలపడుతోంది. భారత్ వరుసగా ఐదు విజయాలు సాధించగా.. ఇంగ్లాండ్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ ఓడితే.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటుంది. అందుకే ఎలాగైనా టీమిండియాపై గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గత 20 ఏళ్లుగా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించని భారత్.. ఆ నిరీక్షణకు చెక్ పెట్టాలని చూస్తోంది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో తొలిసారి టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండా భారత్ బరిలోకి దిగుతోంది. గాయపడిన హార్థిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లాండ్ కూడా గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడుతోంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయబోతున్నామని తెలిపాడు. ఇందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని.. ఇది దృఢమైన నిర్ణయని చెప్పాడు. మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నామన్నాడు. గత మ్యాచ్‌ల్లో సరైన న్యాయం చేయలేకపోయామని.. ఇవాళ గొప్ప ఆటతీరును కనబర్చాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. టీమిండియాతో తలపడనుండడం గొప్ప సందర్భం అని అన్నాడు.
"టాస్ గెలిస్తే.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మాకు విజయాలే లభించాయి. మంచి పిచ్ లాగా ఉంది. 100 ఓవర్ల పాటు బాగా ఉంటుంది. మేము మంచి క్రికెట్ ఆడాం. మరో రెండు పాయింట్లు సాధించాలని చూస్తున్నాం. విరామం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఆడుతున్నాం.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read: Kerala Blast: కేరళలో భారీ పేలుడు, ఒకరి మృతి, 40 మందికి గాయాలు, రాష్ట్రమంతటా అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook