IND Vs ENG Dream11 Team Tips: ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి భారత్ రెడీ.. మరికాసేపట్లో బిగ్‌ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..
India vs England Dream11 Team Prediction and Playing 11: ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమికి ఆసీస్‌పై బదులు చెప్పిన భారత్.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తోంది. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
India vs England Dream11 Team Prediction and Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అజేయంగా నిలిచిన భారత్.. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే అఫ్గానిస్థానిన్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సఫారీతో తలపడనుంది. 2022లో ఇంగ్లాండ్ చేతిలో సెమీస్‌లోనే భారత్ ఓడిపోయింది. ఇప్పడు ఈ మ్యాచ్‌కు రివేంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండడం, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా మంచి టచ్‌లో ఉండడంతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టీమిండియా వరల్డ్ కప్ విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తే విజయం ఈజీ అవుతుంది. విండీస్ గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Kalki 2898 Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
==> ఆడిన మ్యాచ్‌లు: 23
==> భారత్ విజయాలు: 12
==> ఇంగ్లాండ్ విజయాలు: 11
పిచ్ రిపోర్ట్ ఇలా..
గయానా నేషనల్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 128 పరుగులుగా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ బంతి నెమ్మదిగా ఉంటుంది. ఈ మైదానంలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే మ్యాచ్ ప్రారభంలో పేసర్లు ప్రభావం చూపిస్తారు. అయితే మ్యాచ్‌కు మధ్య వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు అదనపు 250 నిమిషాల కేటాయించారు. రిజర్వ్ డే లేదు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. సూపర్-8లో టాప్‌లో నిలిచిన భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
IND vs ENG Playting 11 (అంచనా)..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ,
IND vs ENG Dream11 Prediction Team:
కీపర్ - జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, రిషబ్ పంత్
బ్యాట్స్‌మెన్ - రోహిత్ శర్మ (కెప్టెన్), ఫిల్ సాల్, సూర్యకుమార్ యాదవ్
ఆల్ రౌండర్లు - మొయిన్ అలీ, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
బౌలర్లు - కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిల్ రషీద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter