IND Vs ENG Test Tickets: ఉప్పల్‌లో భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!
IND Vs ENG Tickets 2024: క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్తను చెప్పింది. ఈనెల 25న జరిగే భారత్- ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ అమ్మకాల గురించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తేదిని వెల్లడించారు. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
India Vs England Tickets Booking: ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్మనపల్లి జగన్‌మోహన్ రావు టికెట్ వివరాలను వెల్లడించారు. ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలను ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ టికెట్లను పేటీఎం (Paytm) ఇన్‌సైడర్ యాప్‌లో విక్రయించనున్నామన్నారు. మిగిలిన టిక్కెట్లను ఈ నెల 22 నుంచి ఆన్‌లైన్‌లో పాటు జింఖానాలోని హెచ్‌సీఏ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మనున్నామని ప్రకటించారు. అంతేకాకుండా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు తమకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి టిక్కెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
రిపబ్లిక్ డే రోజు బంపర్ ఆఫర్:
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా మ్యాచ్ చూసేందుకు ఉచితంగా అనుమతించనున్నామని తెలిపారు. తెలంగాణలో పని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను ఈనెల 18వ తేదీలోపు హెచ్‌సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
అంతేకాకుండా స్కూల్ విద్యార్థులకు రోజుకు ఐదు వేలు చొప్పన 25 వేల కాంప్లిమెంటరీ పాసులు కేటాయించామన్నారు. ఈ 25 వేల మందికి ఉచితంగా భోజనం, తాగునీరు అందించనున్నామని తెలిపారు. విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని ప్రకటించనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 300లకు పైగా పాఠశాలల నుంచి అర్జీలు వచ్చాయని, వారితో తమ సిబ్బంది ప్రత్యుత్తరాలు నడుపుతున్నారని జగన్‌మోహన్ రావు చెప్పారు.
టిక్కెట్ రేట్లు: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధరను రూ.200 కాగా గరిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణయించామని జగన్‌మోహన్ రావు చెప్పారు.
సామాన్యులను దృష్టిలో పెట్టుకుని, అందరికి అందుబాటులో ఉండేలాగా ఈ ధరలను నిర్ణయించామని జగన్‌మోహన్ రావు అన్నారు.
టిక్కెట్ల ధరల వివరాలు
రూ. 200
రూ. 499
రూ. 1000
రూ. 1250
ఉతర్త దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.3 వేలు
దక్షిణ దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.4 వేలు
Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter