BBL dont have money to buy Suryakumar Yadav says Glenn Maxwell: భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో పరుగుల వరద పారించాడు. సూపర్ 12 దశలో జింబాబ్వేపై 25 బంతుల్లో 61 పరుగులు చేసి అందరినీ ఆచ్చర్యపరిచాడు. సూపర్ 12 దశలో సూర్య ఆడిన 5 మ్యాచుల్లో 225 పరుగులు చేశాడు. కీలక సెమీస్ మ్యాచులో కాస్త నిరాశపరిచినా.. న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో సత్తాచాటాడు. రెండవ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో (111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు) చెలరేగాడు. అద్భుతంగా ఆడుతున్న సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రశంసలు కురిపించాడు. 'న్యూజిలాండ్‌, భారత్‌ రెండో టీ20 మ్యాచ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. స్కోర్‌ కార్డును చూసి.. ఆరోన్ ఫించ్‌కు ఓ ఫొటో పంపా. అసలేం జరుగుతోంది, సూర్యకుమార్‌ యాదవ్ ఏదో ఇతర గ్రహం మీద బ్యాటింగ్‌ చేసినట్లు ఉంది. ఇరు జట్లలోని మిగతా అందరి పరుగులను కాకుండా.. కేవలం సూర్య స్కోరునే చూస్తే మతిపోయింది. 51 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. మరుసటి రోజు మ్యాచ్‌ రిప్లేను చూశా. ఇతర బ్యాటర్ల కంటే అతడు ఎందుకు ప్రత్యేకమో చెప్పాలంటే కష్టంగానే ఉంది. ఆటగాడిగా చూడటానికే నాకు కష్టంగా అనిపించింది.. అలాంటి ప్రదర్శనకు మేం చాలా దూరంలో ఉండిపోయాం' అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. 


ఆస్ట్రేలియాల జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లోకి సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకొనే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఫన్నీ  సమాధానం ఇచ్చాడు. 'సూర్యకుమార్‌ యాదవ్‌ను దక్కించుకొనేందుకు సరిపడేంత డబ్బు మా దగ్గర లేదు. సూర్యను తీసుకునే ఎలాంటి అవకాశం లేదు. అది జరగాలంటే జట్టులోని ప్రతి ఆటగాడిని తీసేయాలి. లేకపోతే ఆస్ట్రేలియా కాంట్రాక్ట్‌ ఆటగాడిపై వేటు వేయాలి. మాకు డబ్బు కొరత ఉంటుంది' అని 'ది గ్రేడ్ క్రికెటర్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు.


ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద కురిపిస్తున్నాడు. 2022లో 31 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 1164 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు మరియు 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మెన్ అన్న సంగతి తెలిసిందే. సూర్యకు బౌలింగ్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. అతడిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. 


Also Read: Dinesh Karthik: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!


Also Read: చివరి నిమిషంలో కెప్టెన్సీ నుంచి తొలగించిన బీసీసీఐ.. శిఖర్‌ ధావన్‌ ఏమన్నాడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.