Suryakumar Yadav Century help India set 192 target to New Zealand: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. దాంతో కివీస్ ముందు 192 పరుగుల లక్ష్యం ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీ చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (36) పర్వాలేదనిపించాడు. చివరి ఓవర్‌లో కేవలం ఐదు పరుగులే ఇచ్చిన కివీస్ పేసర్ టీమ్ సౌథీ.. హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. సౌథీ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో భారత్‌ 200 పరుగులు చేయలేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయింది. 6వ ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్ రిషబ్‌ పంత్‌ ఔటయ్యాడు. 13 బంతుల్లో 6 బంతులు ఆడి నిరాశపరిచాడు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా పంత్‌ మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌కు జతగా సూర్యకుమార్‌ యాదవ్ కలిశాడు. 6.4 ఓవర్లు ముగిశాక వర్షం మొదలైంది. దాంతో మ్యాచుకు కాసేపు అంతరాయం కలిగింది. మ్యాచ్ నిలిచే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (28), సూర్యకుమార్‌ యాదవ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 


వరుణుడు శాంతించడంతో ఆట మళ్లీ మొదలైంది. అప్పటి దాకా ధాటిగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ (31 బంతుల్లో 36) ఆటకు బ్రేక్‌ పడటంతో లయ తప్పి పెవిలియన్ చేరాడు. 9.1వ ఓవర్లో స్పిన్నర్ ఇష్ సోధి బౌలింగ్‌లో టీమ్ సౌథీకి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. వికెట్ పడినా సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం ధాటిగా ఆడాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ ఫోర్, సిక్సుతో టచ్‌లోకి వచ్చినా.. త్వరగానే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండతో సూర్య చెలరేగాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 



హాఫ్ సెంచ‌రీకి 32 బంతులు తీసుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ త‌ర్వాత వేగం పెంచాడు. దొరికిన బంతిని దొరికిన‌ట్ట‌ల్లా బౌండ‌రీకి బాదాడు. దాంతో మరో 17 బంతుల్లోనే 50 ప‌రుగులు చేసి.. సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. సూర్య ధాటైన ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా కివీస్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీ2ం ఫార్మాట్‌లో సూర్య‌కు ఇది రెండో సెంచ‌రీ. 


Also Read: ప్రెగ్నెంట్ కుక్కను చిత్రహింసలకు గురిచేసిన ఢిల్లీ విద్యార్థులు.. ఏకంగా 20 మంది కలిసి..! ఎఫ్‌ఐఆర్ నమోదు  


Also Read: IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.