Delhi Don Bosco Technical Institute Students tortured and killed Pregnant dog: ఇటీవల కాలంలో కొందరు ఆకతాయిలు మూగజీవాలను వేధిస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచికం పొందుతున్నారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతొంది. గర్భిణిగా ఉన్న ఓ వీధి కుక్కపై కొంతమంది విద్యార్థులు సామూహిక దాడి చేసి.. చిత్రహింసలు పెట్టారు. అంతేకాదు ఆ శునకాన్ని రాడ్, కర్రలతో కొట్టి హతమార్చారు కూడా. ఈ అవమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం... సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణంలో ఓ షెడ్ ఉంది. అందులోకి ఓ ప్రెగ్నెంట్ కుక్క వచ్చింది. ఇది గమనించిన సిబ్బంది దాన్ని చిత్రహింసలకు గురిచేశారు. డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సిబ్బందితో పాటు 20 మంది విద్యార్థులు గర్భిణిగా ఉన్న వీధి కుక్కపై సామూహిక దాడి చేశారు. ఒక విద్యార్థి పెద్ద రాడ్ పట్టుకుని షెడ్ లోపలి ప్రవేశించాడు. మిగిలిన విద్యార్థులు బయట నుండి అతనిని ఉత్సాహపరిచారు. రాడ్, కర్రలతో శునకాన్ని కొట్టి కొట్టి చంపేశారు.
డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు ప్రెగ్నెంట్ కుక్కపై చేసిన దాడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో శనివారం వైరల్‌గా మారింది. 'Tajinder Pal Singh Bagga' అనే ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. 'జాకీర్ నగర్‌లోని డాన్‌బాస్కో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 20 మంది విద్యార్థులు గర్భిణిగా ఉన్న కుక్కను చంపారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని పేర్కొన్నారు. ఈ వీడియో శనివారం నుంచి నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
Group of 20 students of Don Bosco technical institute Zakir nagar killed a pregnant dog ,no action taken till now @DCPSEastDelhi @CPDelhi pic.twitter.com/JM1ten2Oyz
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 19, 2022
గర్భిణిగా ఉన్న కుక్క దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జంతుసేవ సమితి కార్యకర్తలు మరియు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ డిపార్ట్‌మెంట్.. డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు, సిబందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిబ్బంది మాత్రమే కాదు విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!
Also Read: IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. సంజూకి తప్పని నిరాశ! ఓపెనర్లుగా పంత్, ఇషాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.