0 && comm[ts].geo.indexOf($root.$GEO.country) == -1" ng-if="comm[ts].evt != 'Plugin:news' && comm[ts].evt != 'Plugin:video' && comm[ts].evt != 'Plugin:comments'">India have won the toss and have opted to bat: న్యూజిలాండ్‌, భారత్ (India vs New Zealand) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో వాంఖ‌డే మైదానంలో రెండో టెస్ట్ (Mumbai Test) ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ (Toss) గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు మొద‌టి సెష‌న్‌ కోల్పోవాల్సి వచ్చింది. మ్యాచ్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌ళ్లీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. తొలి టెస్టుకు అజింక్య ర‌హానే (Rahane) సార‌థ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. గాయాల కారణంగా ఈ మ్యాచ్‌లో అజింక్య ర‌హానే, రవీంద్ర జ‌డేజా, ఇశాంత్‌ శర్మలు ఆడడం లేదు. ర‌హానే స్థానంలో కోహ్లీ రాగా.. జ‌డేజా, ఇశాంత్‌ స్థానాల్లో మొహ్మద్ సిరాజ్ (Siraj), జయంత్ యాదవ్ (Jayant) జట్టులోకి వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

0 && comm[ts].geo.indexOf($root.$GEO.country) == -1" ng-if="comm[ts].evt != 'Plugin:news' && comm[ts].evt != 'Plugin:video' && comm[ts].evt != 'Plugin:comments'">మరోవైపు ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) గాయం కారణంగా దూరం అయ్యాడు. అతడిని మోచేతి గాయం ఇబ్బందిపెడుతోంది. కేన్ స్థానంలో టామ్‌ లాథమ్‌ (Tom Latham) సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కేన్ బదులుగా డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. ఈరోజు 9 గంటలకు పడాల్సిన టాస్‌.. రెండున్నర గంటలు ఆలస్యంగా పడింది. గత రెండు రోజులుగా ముంబైలో వర్షం కురవడంతో వాంఖడే పిచ్ పూర్తిగా తడిసి ముద్దయింది. వాంఖడే పిచ్ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ సమయానికి ఆరంభం కాలేదు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి పరిస్థితులు అదుపులోకి రావడంతో టాస్‌ పడింది. దీంతో తొలి రోజు ఆటలో మొదటి సెషన్‌ తుడిచిపెట్టుకుపోయింది.


0 && comm[ts].geo.indexOf($root.$GEO.country) == -1" ng-if="comm[ts].evt != 'Plugin:news' && comm[ts].evt != 'Plugin:video' && comm[ts].evt != 'Plugin:comments'">Also Read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్‌.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?


తుది జట్లు:
భారత్: శుభ‌మ‌న్ గిల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, చ‌తేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయ‌ర్ అయ్య‌ర్‌, వృద్ధిమాన్ సాహా (కీపర్), రవిచంద్రన్ అశ్విన్‌, జ‌యంత్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ఉమేశ్ యాద‌వ్‌, మొహ్మద్ సిరాజ్‌. 
న్యూజిలాండ్‌: విల్ యంగ్‌, టామ్ లాథ‌మ్‌ (కెప్టెన్), డారెల్ మిచెల్‌, రాస్ టేల‌ర్‌, హెన్రీ నికోల‌స్‌, టామ్ బ్లండెల్‌ (కీపర్), రాచిన్ ర‌వీంద్ర‌, కైలీ జేమీస‌న్‌, టిమ్ సౌథీ, నీల్ వాగ్న‌ర్‌, అజాజ్ ప‌టేల్‌. 


Also Read: Evaru Meelo Koteeswarulu: మహేష్ కోసం రూల్స్ బ్రేక్.. రూ.కోటి ప్రశ్న ముందుగా అడిగేసిన NTR?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook