India vs Pakistan Head to Head Records: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే ఓ ఎమోషన్. మ్యాచ్ జరిగేది ఎక్కడైనా స్టేడియాలు హౌస్‌ఫుల్ అవ్వడం ఖాయం. మ్యాచ్ జరుగుతున్నంతసేపు టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతారు. ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న దయాదుల మధ్య పోరుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని క్యాండీ వేదికగా మ్యాచ్‌ జరగనుండగా.. వరుణుడు భయపెడుతున్నాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మ్యాచ్ పూర్తిగా సాగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ పోరు తరువాత రెండు జట్లు సూపర్‌ ఫోర్‌కు చేరుకుంటే.. మరోసారి సెప్టెంబర్ 10న తలపడతాయి. ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ ఫైట్ సెప్టెంబర్ 17న జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ రికార్డులు ఇలా..


ఆసియా కప్‌ 15సార్లు నిర్వహించగా.. భారత జట్టు ఏడుసార్లు విజేతగా నిలిచింది. వన్ డే ఫార్మాట్‌లో టీమిండియా 49 మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో 31 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 34 విజయాలతో శ్రీలంక టాప్ ప్లేస్‌లో ఉంది. పాక్ టీమ్ 2000, 2012లో రెండుసార్లు ఆసియా కప్‌ గెలుచుకుంది. 1986, 2014, 2022లో రన్నరప్‌గా నిలిచింది. పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన 45 మ్యాచ్‌లలో 26 విజయాలు సాధించింది.


ఆసియా కప్‌లో ఇరు జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఏడుసార్లు భారత్ విజయం సాధించగా.. ఐదుసార్లు పాకిస్థాన్ విజయం సాధించింది. 2018 ఎడిషన్‌లో రెండుసార్లు తలపడ్డగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, మరో మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో భారత్ విజేతగా నిలిచింది. 2022లో భారత్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో దయాది జట్టు విజయం సాధించింది. శ్రీలంలో భారత్-పాక్ జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. మరోమ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 


Also Read: Chandrababu Naidu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి..?  


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook