Shahid Afridi about India vs Pakistan match at Asia Cup 2022: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న ఆసియా కప్ ఆరంభం కానుండగా.. తొలి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది. 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో.. ఇండో-పాక్ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హైవోల్టెజీ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందని అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. ఇటీవల ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అఫ్రిది సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరగనుంది కదా. ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది' అని ప్రశ్నించాడు. అఫ్రిది పాక్‌ మాజీ ఆటగాడు కాబట్టి.. సొంత దేశమే గెలుస్తుందని చెప్తాడని అందరూ ఊహించారు. అయితే ఎవరూ ఊహించని సమాధానమిచ్చాడు. 'మెగా మ్యాచులో ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే గెలుస్తారు' అని చెప్పాడు. 



టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయిన భారత్ చాలా ఏళ్ళ తర్వాత పాక్ చేతిలో ఓడిపోయింది. ఆగష్టు 28న ఆసియా కప్‌ 2022లో పాక్‌ను భారత్‌ ఢీకొంటుంది. ఇండో-పాక్ జట్లు సూపర్‌-4 దశకు చేరితే.. అక్కడ మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌కు వెళ్తే దాయాది జట్లు మళ్లీ పోటీపడతాయి. ఇదే జరిగితే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ ఇరుజట్లు 14 సార్లు తలపడగా.. 8 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. పాక్ ఐదింటిలో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.


Also Read: మూడుసార్లు కాటేసినా.. భారీ పామును పట్టుకున్నాడు! వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా


Also Read: పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న స్టార్ ప్లేయర్ ఫామ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook