Snake Viral Video: మూడుసార్లు కాటేసినా.. భారీ పామును పట్టుకున్నాడు! వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా

Snake Viral Video, Man Caught Huge Snake after three Bites. ఓ పెద్ద పాము ఓ వ్యక్తిని మూడుసార్లు కాటేసినా.. బెదరకుండా పట్టుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 24, 2022, 04:46 PM IST
  • మూడుసార్లు కాటేసినా
  • భారీ పామును పట్టుకున్నాడు
  • వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా
Snake Viral Video: మూడుసార్లు కాటేసినా.. భారీ పామును పట్టుకున్నాడు! వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా

Man Caught Huge Snake after three Bites: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోస్ వైరల్ అవుతాయి. సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించినవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సాధారణంగా పామును చూడగానే చెమట పడుతుంది. ఎందుకంటే విషపూరితమైనవి కాటు వేస్తే ప్రాణాలకే ప్రమాదం. అయితే కొంతమంది మాత్రం పాములంటే అస్సలు భయపడని వారు కూడా ఉంటారు. ప్రపంచంలో వారి సంఖ్య చాలా తక్కువ. ఓ పెద్ద పాము ఓ వ్యక్తిని మూడుసార్లు కాటేసినా.. బెదరకుండా పట్టుకున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో పరుగెడుతున్న పామును పట్టుకోగానే.. అది కాటేస్తుంది. దాంతో అతడికి రక్తం కూడా వస్తుంది. 

ఆ వ్యక్తి పామును రెండోసారి పట్టుకోగానే మరోసారి కాటేస్తుంది. అయినా కూడా అతడు ఏ మాత్రం వెనకడుగువేయలేదు. మరోసారి పట్టుకోగా పాము మళ్లీ కాటేస్తుంది. చివరికి అతడు పామును పట్టుకుంటాడు. ఇందుకు సంబందించిన వీడియో 'world_of_snakes' అనే  ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ ఖాతా పాములకు సంబంధించిన విభిన్న వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. వీడియో చూసినా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల విక్రమ్ వేద టీజర్ అద్దిరిపోయిందిగా

Also Read: AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News