IND vs PAK Tickets: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు కావాలా.. పూర్తి డీటెయిల్స్ ఇవే!
India vs Pakistan Asia Cup 2022 Match Tickets available from August 15. ఆగస్టు 15 నుంచి ఆసియా కప్ 2022 మ్యాచుల టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ఏసీసీ ప్రకటించింది.
India vs Pakistan Asia Cup 2022 Match Tickets available from August 15: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. మరో 13 రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో.. ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆగస్టు 15 నుంచి ఆసియా కప్ 2022 మ్యాచుల టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'ఆసియా కప్ 2022 మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలు ఆగస్టు 15న అమ్మకానికి వస్తాయి. మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి సోమవారం నుంచి కింది లింక్‌ను క్లిక్ చేయండి' అని ఏసీసీ ట్వీట్ చేసింది. platinumlist.net అనే వెబ్ సైట్ ద్వారా ఆసియా కప్ మ్యాచుల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అన్ని మ్యాచుల కంటే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2022 కోసం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. మిగిలిన ఓ బెర్త్ కోసం యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంది. 6వ బెర్త్ కోసం యూఏఈ, హాంకాంగ్ మధ్య తీవ్ర పోటీ నెలకొలనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆహార కొరత కారణంగా టోర్నమెంట్‌ను యూఏఈకి మార్చారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022కు ఇది సన్నద్ధతగా ఉపయోగపడనుంది.
Also Read: Sun Transit 2022: 3 రోజుల తర్వాత.. ఈ రాశుల వారిని వరించనున్న అదృష్టం! ఇక డబ్బేడబ్బు
Also Read: Shaniwar Ke Upay: భాద్రపద రెండవ శనివారం రోజునా ఇలా చేస్తే.. అన్ని కోరికలు తీరిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook