IND vs PAK: భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!
Pakistan Women have won the toss and have opted to bat. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరగనున్న ఈ గెలిచిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Pakistan Women opt to bat vs India Women: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్లు మరోకొద్ది సేపట్లో తలపడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరగనున్న ఈ గెలిచిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది పొడి వికెట్ అని, భారీ స్కోర్ చేయాలనుకుంటున్నామని బిస్మా పేర్కొంది. చివరగా భారత్‌పై గెలిచినందున ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని తెలిపింది. కీలక మ్యాచ్ కాబట్టి భారత్, పాకిస్థాన్ హోరాహోరీగా తలపడనున్నాయి.
ఈ మ్యాచులో భారత్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయింది. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బే. మంధాన లేకపోవడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగస్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.
ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ 4 విజయాలు సాధించింది. 2 మ్యాచుల్లో మాత్రమే పాక్ గెలిచింది. మొత్తంగా టీ20ల్లో రెండు జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 గెలవగా.. పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లో గెలిచింది.
తుది జట్లు:
భారత్: షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగస్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.
పాకిస్తాన్: జావేరియా ఖాన్, మునీబా అలీ, బిస్మా మరుఫ్ (కెప్టెన్), నిదా దర్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమన్ అన్వర్, నశ్రు సంధు, సదియా ఇక్బాల్.
Also Read: Meta Layoffs 2023: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఇప్పటికే 11 వేల మంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.