3వ వన్డేలో సౌతాఫ్రికాపై గెలిచి సఫారీల ఆట కట్టించిన కోహ్లీ సేన
మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం
6 వన్డేల సిరీస్‌లో భాగంగా కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానం వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలుచుకున్న సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. భారత ఆటగాళ్లు పెద్దగా రానించకపోయినప్పటికీ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లు రెచ్చిపోవడంతో మొత్తానికి 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ 303 పరుగులు చేయగలిగింది.
అనంతరం టీమిండియా విధించిన 304 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పిచ్‌లోకి ఎంటరైన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మొదట్లోనే తీవ్రంగా తడబడ్డారు. మొదటి 24 ఓవర్లలో కేవలం 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సఫారీలు ఆ తర్వాత కూడా పరుగులు రాబట్టడం కన్నా వికెట్లు కాపాడుకోవడానికే ఎక్కువ కష్టాలు పడ్డారు. అలా సౌతాఫ్రికా 40 ఓవర్లకే 179 పరుగులకే ఆలౌట్ అయి మైదానం నుంచి చాపచుట్టేసింది. ఈ గెలుపుతో 6 వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-0తో ఆధిక్యాన్ని చాటుకుంది. టీ 20, టెస్ట్ సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేనకు వన్డే సిరీస్ పై ఆశలు పెంచుకోవడానికి ఈ విజయం ఎంతో బూస్టింగ్ ఇచ్చింది.