IND vs SA 3rd ODI match Highlights: ఇండియా vs సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే సిరీస్‌లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో సాతాఫ్రికా బ్యాటింగ్ చేపట్టింది. మొదట బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలకడగా ఆడలేకపోయింది. జాన్మన్ మలన్ 15 పరుగులు, హెయిన్రిచ్ క్లాసెన్ 34 పరుగులు, మార్కో జాన్సెన్ 14 పరుగులు.. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహాయించి ఏ ఒక్కరూ డబల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేదు. ఫలితంగా 27.1 ఓవర్లకే సౌతాఫ్రికా జట్టు మొత్తం స్కోర్ కూడా సెంచరీ దాటకుండానే 99 పరుగులకే చాప చుట్టేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు 100 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తరపున ఓపెనర్లలో కెప్టేన్ శిఖర్ ధావన్ 8 పరుగులకే మార్కో జన్సన్ చేతిలో రనౌట్ అయి వెను తిరిగినా.. శుబ్ మన్ గిల్ మాత్రం నిలకడగా ఆడుతూ 49 పరుగులతో ( 57 బంతుల్లో 8 ఫోర్లు) రాణించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 10 పరుగులకే ఇమాద్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు, సంజూ శాంసన్ 2 పరుగులతో 19.1 ఓవర్లకే టీమిండియా 105 రన్స్ కొట్టి విజయం సాధించింది. 


సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, ఇమాద్‌లకు చెరో వికెట్ దక్కింది. మొహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకోగా.. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 


సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు
సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ టీమిండియా బౌలర్ల ముందు చేతులెత్తేశారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చాడు. 4 వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. అవేశ్ ఖాన్ సైతం ఐదు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 1 మెయిడిన్ ఓవర్ చేయగా.. వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మెద్‌లు పోటాపోటీగా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.


Also Read : Roger Binny BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ.. కార్యదర్శి జై షానే!


Also Read : Jasprit Bumrah: బుమ్రా లేని భారత జట్టును అలానే చూస్తారు.. వ్యూహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది: బంగర్‌


Also Read : 9 Slips Fielders: స్లిప్‌లో 9 మంది ఫీల్డర్లు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!


Also Read : ICC awards: 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా హర్మన్​, రిజ్వాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి