Sanjay Bangar on Jasprit Bumrah Absence In T20 World Cup 2022: వెన్ను నొప్పితో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. త్వరలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2022కి దూరమయ్యాడు. బుమ్రా దూరం కావడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి టోర్నీలో బుమ్రా లేకపోవడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని పలువురు మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఈ విషయంపై స్పందించారు. బుమ్రా లేని టీమిండియాను ప్రత్యర్థులు మరో కోణంలో చూస్తారని, వ్యూహాలపై కూడా ప్రభావం చూపిస్తుందని బంగర్ అన్నారు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా విషయంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆందోళన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. రెండో మ్యాచ్‌కు జట్టులో చేరాడు. ఆపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందు కూడా చాలాకాలం గాయాలతో జట్టుకు దూరంగానే ఉన్నాడు. అయితే టీమిండియాకు బుమ్రా బలం అనడంలో ఎలాంటి అనుమానం లేదు' అని అన్నారు.
'ప్రపంచకప్ 2022కి జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బుమ్రా లేని భారత జట్టును ప్రత్యర్థి జట్లు మరో కోణంలో చూస్తాయి. భారత పేసర్ లేని బౌలింగ్ దళాన్ని ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. అయితే క్రీడల్లో ఒకరి నష్టం.. మరో ఆటగాడికి మంచి అవకాశం. బహుశా దీపక్ చహార్, మొహ్మద్ షమీ లేదా అర్షదీప్ సింగ్ జట్టులో చేరి ప్రపంచకప్‌లో సత్తా చాటుతారని అనుకుంటున్నా' అని సంజయ్ బంగర్ పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2022 ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం అయ్యాడు. వెన్ను గాయంతో జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని పునరావాస కేంద్రంలో ఉన్నాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్నది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. స్టాండ్‌బైగా ఉన్న మొహ్మద్ షమీకి అవకాశం రానుంది.
Also Read: పటీదార్, త్రిపాఠికి నిరాశే.. ఆ ఒక్కడికి ఛాన్స్! మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే
Also Read: Ram Charan Trujet : దివాలతీసిన రామ్ చరణ్ కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook