IND vs SA 3rd T20I, South Africa won the toss and opted to field: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా  భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ టాస్ గెలవడం వరుసగా ఇది మూడోసారి. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవని బావుమా, రిషబ్ పంత్ చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ, కటక్ టీ20లలో గెలిచిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. విశాఖ టీ20 కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలి చూస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచులు ఓడిన టీమిండియాకు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ రేసులో ఉంటుంది. అందుకే గెలుపే లక్ష్యంగా పంత్ సేన బరిలోకి దిగుతోంది.


ప్రస్తుతం విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్నేళ్లుగా విశాఖపట్నంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడంతో.. నేడు జరిగే మూడో టీ20కి అభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే మైదానం వద్ద బారులు తీరి లోపలికి వచ్చారు. భారత జెండాలతో విశాఖ మైదానం కనువిందుగా మారింది. 



తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్/కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్. 
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ. 


Also Read: Deepika Padukone Hospitalised: ఆస్ప‌త్రిలో దీపికా పదుకొణె.. ఆగిన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్!


Also Read: Bhuvneshwar Kumar T20 Record: మరొక్క వికెటే.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న భువనేశ్వర్‌ కుమార్!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook