Ruturaj Gaikwad Trolls: రుతురాజ్.. నీకంత అహంకారం ఎందుకు! ధోనీ, కోహ్లీ కూడా ఇలా చేయలేదు
IND vs SA 5th T20I, Netizens trolls Ruturaj Gaikwad. భారత్ vs దక్షిణాఫ్రికా ఐదవ టీ20 మ్యాచులో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన పనిపై అభిమానులు మండిపడుతున్నారు.
IND vs SA 5th T20I, Netizens trolls Ruturaj Gaikwad: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్‌లో వరుణుడు ఊహించని ఫలితం ఇచ్చాడు. ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా జరగాల్సిన చివరిదైన ఐదవ టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. టాస్ అనంతరం ఆటగాళ్లు మైదానంలోకి రాగానే వర్షం కురిసింది. దాంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో రెండోసారి వర్షం కురిసింది. ఎంతకీ వరణుడు కరుణించకపోవడంతో మ్యాచ్ రద్దయింది. దాంతో ఐదు టీ20ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
అయితే ఈ మ్యాచులో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన పనిపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐదవ టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం పడుతుండంతో టీమిండియా బ్యాటర్లు డగౌట్‌లో కూర్చున్నారు. ఇక మైదానంలోని వర్షపు నీటిని తొలగించడానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడింది. అవుట్ ఫీల్డ్ చిత్తడి కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. గ్రౌండ్ స్టాఫ్ ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగిస్తూ కనిపించారు. వరుణుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చినా.. మ్యాచ్ జరిగేలా అవుట్ ఫీల్డ్‌ను తయారు చేయడానికి గ్రౌండ్ స్టాఫ్ శ్రమించారు.
వర్షం కారణంగా టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హెల్మెట్, చేతులకు గ్లోవ్స్ ధరించి డగౌట్‌లో కూర్చుకున్నాడు. అక్కడే ఉన్న ఓ మైదాన సిబ్బంది.. డగౌట్‌లో ఉన్న రుతురాజ్ పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది చుసిన రుతురాజ్.. అతణ్ని పక్కకి వెళ్లిపొమ్మంటూ నెట్టేశాడు. డిస్టెన్స్ మెయింటెన్ చేయ్ అన్నట్లుగా అసహనం ప్రదర్శించాడు. దాంతో మైదాన సిబ్బంది దూరంగానే ఉండి సెల్ఫీ తీసుకున్నాడు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మ్యాచ్ సజావుగా సాగడానికి ఎంతో కష్టపడిన గ్రౌండ్ స్టాఫ్ పట్ల రుతురాజ్ గైక్వాడ్ ఇలా అమర్యాదగా ప్రవర్తించడంతో అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా ఓపెనర్ మీద కామెంట్స్, మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. 'రుతురాజ్.. నీకంత అహంకారం ఎందుకు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు' అని మరొకరు కామెంట్ చేశాడు. గ్రౌండ్స్‌మెన్‌లు ఇలా వ్యవహరించడం బాధాకరం, రుతురాజ్‌కి ఆడే అర్హత లేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Constipation Treatment: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా సులభంగా విముక్తి పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook