Sunil Gavaskar slams Mohammed Siraj over Injuring Temba Bavuma in 1st Test: దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు 191 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా 113 పరుగుల తేడాతో విజయం సాదించింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ తలో 3 వికెట్లు తీయగా.. మొహ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj) 2 వికెట్లు పడగొట్టాడు. అయితే సిరాజ్ తన చేతిలోని బంతిని బలంగా విసరడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ తెంబా బావుమాకు బలంగా తాకింది. ఈ ఘటనపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 62వ ఓవర్‌ను హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో సిరాజ్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని తెంబా బావుమా డిఫెన్సివ్ షాట్ ఆడాడు. బంతి సిరాజ్ వద్దకు వచ్చింది. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్‌.. బావుమా పైకి బలంగా విసిరాడు. బంతి కాస్త బావుమా పాదాలకు తగిలింది. దాంతో తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు. ప్రస్తుతం బావుమా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. సిరాజ్ దూకుడుగా ప్రవర్తించడంపై భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బావుమా పరుగు తీసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అలాటప్పుడు సిరాజ్‌ బంతిని తిరిగి బ్యాటర్‌పైకి విసిరే అవసరం లేదని సన్నీ పేర్కొన్నారు.


Also Read: Virat Kohli: కోహ్లీ పేరు పక్కన అది లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.. సమయం పడుతుంది: ఆకాష్ చోప్రా


సునీల్ గవాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మొహ్మద్ సిరాజ్‌ విసిరిన బంతికి తెంబా బావుమా (Temba Bavuma) పరుగు తీసే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఆ సమయంలో సిరాజ్ బంతిని అలా బలంగా విసరాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ బావుమా పరుగు కోసం ప్రయత్నిస్తే.. సిరాజ్ చేసిన దాంట్లో అర్థముండేది. చివరకు బావుమా నొప్పితో ఎంత బాదపడ్డాడో మనం చూసాం. అయినా కూడా అతడు సహనంతోనే ఉన్నాడు. సిరాజ్‌ దూకుడు గురించి ఎవరైనా మాట్లాడాలి' అని అన్నారు. ఇక రెండో టెస్టు జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జనవరి 3న ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలుస్తుంది. 


Also Read: Varshini Latest Photos: న్యూఇయర్ లో డోస్ పెంచేసిన యాంకర్ వర్షిణి.. హాట్ పిక్స్ మామూలుగా లేవుగా!


తెంబా బావుమా ఎపిసోడ్ పక్కన పెడితే.. మొహమ్మద్ సిరాజ్ (Siraj) అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. 2021లో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఇది భారత క్రికెట్‌కు అతిపెద్ద సానుకూలాంశం. సిరాజ్ 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌తో కెరీర్ ప్రారంభించాడు. ఆ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు. గబ్బా టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ మరియు ఉమేష్ యాదవ్ గైర్హాజరీలో భారత పేస్ అటాక్‌ను నడిపించిన తీరు అద్భుతం. ఆ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి అద్భుత విజయం అందించాడు. ఆపై ప్రతి సిరీసులో సత్తాచాటి కీలక ఆటగాడిగా మారాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి