Varshini Latest Photos: న్యూఇయర్ లో డోస్ పెంచేసిన యాంకర్ వర్షిణి.. హాట్ పిక్స్ మామూలుగా లేవుగా!

Varshini Latest Photos: నటిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి సౌందరరాజన్.. ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. బుల్లితెర ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న వర్షిణి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తరచూ ఫొటోషూట్ లు షేర్ చేస్తుంది. న్యూఇయర్ సందర్భంగా తన అందాల ఆరబోత చేసిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా హాట్ పిక్స్ వైరల్ గా మారాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 08:35 PM IST
Varshini Latest Photos: న్యూఇయర్ లో డోస్ పెంచేసిన యాంకర్ వర్షిణి.. హాట్ పిక్స్ మామూలుగా లేవుగా!

Varshini Latest Photos: యాంకర్ వర్షిని పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరలో హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిని సౌందరాజన్‌.. 'ఢీ' డ్యాన్స్ షోతో పాపులర్‌ అయ్యింది. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోకి మరింత గ్లామర్‌ తీసుకొచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వర్షిని సఫలం అయ్యింది. 

అదే విధంగా అందులో 'జబర్దస్త్' కమెడీయన్‌ హైపర్‌ ఆది కి జోడిగా వర్షిని ఎంతో సందడి చేసింది. కానీ ఏమైందో తెలియదు ఆ తర్వాత 'ఢీ' షో నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు సందడి చేసింది. అలాగే వర్షిని బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలోనూ వర్షిణి నటించింది. ఈ క్రమంలో 2010లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన 'శంభో శివ శంభో' చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. అయితే ఆమె నటించిన పాత్రకు అంతటి ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని.. యాంకరింగ్ వైపు వైపు అడుగులు వేసింది.

దీంతో ప్రస్తుతం యాంకర్ వర్షిణి కి సినీ ఇండస్ట్రీలో పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాకపోవడం వల్ల ఆమె కొంతమేర నిరాశ చెందుతోంది. దాంతో సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందాలు ఆరబోస్తుంది. అలాంటి ఓ హాట్ ఫొటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

వర్షిణి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమెకు ప్రాధాన్యమున్న పాత్రను దర్శకుడు గుణశేఖర్ అప్పగించినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఓ చిన్న సినిమాలోనూ హీరోయిన్ గా వర్షిణి ఎంపికైందని తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.   

Also Read: AAGMC First Look: కృతిశెట్టి న్యూ మూవీ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫస్ట్ లుక్ రిలీజ్

Also Read: RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News