Ind vs SA Test Series: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ సమం కాగా, వన్డే సిరీస్ 2-1తో ఇండియా కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కీలకమైన టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సఫారీ గడ్డపై డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో ఒకరిద్దరు తప్ప అందరు సీనియర్లు వచ్చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై ఆ జట్టుతో ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికపై మొదటి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కాగా, కేప్‌టౌన్ వేదికగా రెండవ టెస్ట్ జనవరి 3 నుంచి జరగనుంది. ఇప్పటి వరకూ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీ20 సిరీస్ సమం కాగా, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని వన్డే సిరీస్ ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్‌లకు టీమ్ ఇండియా సీనియర్లు దూరంగా ఉండగా మొత్తం కుర్రోళ్లతో సిరీస్ నడిచింది. ఇక ఇప్పుడు కీలకమైన రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఒకరిద్దరు తప్ప సీనియర్లు వచ్చేశారు. రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 


ఈ టెస్ట్ సిరీస్‌కు కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. చేతికి గాయం కావడంతో రుతురాజ్ గైక్వాడ్ దూరమవుతున్నాడు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. దాంతో మార్పులు అనివార్యమయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ స్తానంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్‌కు స్థానం లభించింది. ప్రస్తుతం ఇతడు ఇండియా ఎ జట్టు తరపున దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. దాంతో ఇతడినే ఎంపిక చేసింది బీసీసీఐ. ఇండియా ఎ తరపున అభిమన్యు ఈశ్వరన్ రెండవ రోజు 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అభిమన్యు ఈశ్వరన్ గతంలో ఓసారి ఇండియాకు ఎంపికైనా తుది జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈసారి ఏమౌతుందో మరి చూడాలి. 2013లో పశ్చిమ బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రవేశించిన అభిమన్యు ఈశ్వరన్...6 వేలకు పైగా పరుగులు చేశాడు. 


టీమ్ ఇండియా


రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా, ముకేష్ కుమార్, పర్దీష్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్


Also read: Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్ శర్మకేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook