భారత్- శ్రీలంక మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలిటెస్ట్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 59.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కొద్ది సమయం తరువాత శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. శ్రీలంక లక్ష్యం 163 పరుగులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరో వికెట్: మూడవరోజు ఆట ప్రారంభంలో పుజారా, సాహా క్రీజులో ఉన్నారు. భారత జట్టు స్కోర్ 79 పరుగుల వద్ద పుజారా ఔటయ్యాడు. గమగె బౌలింగ్ లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా బౌల్డ్ అయ్యాడు.


ఏడో వికెట్: జట్టు స్కోర్ 127 పరుగుల వద్ద జడేజా ఔటయ్యాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన జడేజా పెరెరా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.


ఎనిమిదో వికెట్: జట్టు స్కోర్ 128 ఉండగా..  సాహా 22 పరుగులు చేసి పెరెరా బౌలింగ్ లో మ్యాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


తొమ్మిదో వికెట్: జట్టు స్కోర్ 146 ఉండగా..  భువనేశ్వర్ 13 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్ లో డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


కడపటి వార్తలందేసరికి శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించి రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద కరుణరత్నే 8 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. జట్టు స్కోర్ 34 పరుగుల వద్ద సమరవిక్రమ 23 పరుగులు చేసి భవనేశ్వర్ బౌలింగ్లో సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.