IND vs SL: టీమిండియాదే బ్యాటింగ్.. పుజారా స్థానంలో తెలుగు ఆటగాడికి చోటు! ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!
IND vs SL 1st Test Playing 11 is Out: మరికొద్ది సేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Shubman Gill, Shreyas Iyer replaces Pujara and Rahane for IND vs SL 1st Test: రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫామ్ లేమితో సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారాలపై వేటు పడడంతో వారి స్థానాల్లో హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు. దాంతో జట్టులో చోటు ఆశించిన శుభ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురైంది. స్వదేశం కాబట్టి జయంత్ యాదవ్ రూపంలో అదనపు స్పిన్నర్‌ను రోహిత్ ఎంచుకున్నాడు.
మొహాలీ టెస్ట్ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. కెరీర్‌లో కోహ్లీ ఆడుతున్న 100వ టెస్ట్ మ్యాచ్ ఇది. దాంతో ఈ టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రోహిత్ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు కావడం విశేషం. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌కు స్వదేశంలోనూ ఇదే తొలి సిరీస్. ప్రస్తుతం రోహిత్ మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్నాడు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 44 టెస్టులు జరగ్గా.. అందులో భారత్ 20 విజయం సాధించగా, 7 శ్రీలంక గెలిలిచింది. మిగతా 17 మ్యాచులు డ్రా అయ్యాయి. ఇక మొహాలీలో భారత్ ఇప్పటివరకు 13 టెస్టులు ఆడగా.. 7 గెలిచి, 1 మ్యాచులో ఓడిపోయింది. మరో 5 టెస్టులు డ్రాగా ముగిసాయి. ఈరోజటి మ్యాచులో భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), విశ్వ ఫెర్నాండో, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.
Also Read: IPL 2022 RuPay: ఐపీఎల్ భాగస్వామిగా 'రూపే'.. మూడేళ్ల పాటు ఒప్పందం!!
Also Read: Horoscope Today March 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook