IND vs SL 3rd T20I Playing XI Out: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని హార్దిక్ చెప్పాడు. మరోవైపు లంక ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. భానుకా రాజపక్సే స్థానంలో అవిష్క ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి భారత్‌, శ్రీలంక జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో సిరీస్‌ విజేతను తేల్చే మూడో టీ20 గెలిచి ట్రోఫీ గెలుచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి రెండు టీ20ల్లో యువ భారత్‌ ఆట ఏమాత్రం ఆకట్టుకోలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్‌ పూర్తిగా అదుపు తప్పింది. 



తుది జట్లు:
భారత్: ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్‌ పటేల్, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చహల్‌.
శ్రీలంక: నిశాంక, కుశాల్ మెండిస్‌, అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్‌ అసలంక, డాసున్‌ శనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమీక కరుణరత్నె, మహీశ్ తీక్షణ, కాసున్‌ రజితా, మదుశంక. 


Also Read: BCCI Selection Committee: చీఫ్‌ సెలక్టర్‌గా మరోసారి చేతన్‌ శర్మ.. బీసీసీఐ కొత్త సెలెక్షన్‌ కమిటీ సభ్యులు వీరే!


Also Read: Best SUV in India: మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు.. మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.