India Vs Sri Lanka Toss and Playing 11: ఆసియా కప్‌ ఫైనల్‌ ఫైట్‌కు భారత్, శ్రీలంక జట్లు రెడీ అయ్యాయి. సూపర్‌-4లో పటిష్ట పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు చేరుకోగా.. చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన భారత్.. బంగ్లాదేశ్‌లో చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకోవాలని శ్రీలంక చూస్తోంది. కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. మంచి వికెట్ లాగా ఉంది. మధ్యాహ్నం కొంత టర్న్ ఉంటుంది. అందరం ఉత్సాహంతో ఉన్నాం. వెల్లలాగే, పతిరణ, సమరవిక్రమ ప్రదర్శన చాలా బాగుంది. ఇది మంచి జట్టు. ఫలితాలు బాగా వస్తున్నాయి. ఇది వరల్డ్ కప్‌కు ముందు మాకు మంచి బూస్ట్. తీక్షణ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి వచ్చాడు.." అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తెలిపాడు.


"టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్ పొడిగా ఉంది. శ్రీలంక స్కోరు బోర్డుపై ఎంత పెట్టినా ఛేజింగ్ చేస్తామన్న నమ్మకం ఉంది. బంతితో దూకుడు ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం. చివరి మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. ఈ పిచ్‌పై 240 అయినా మంచి స్కోరు. ఈ రోజు మా పని బంతితో బాగా రాణిచడం.. ఆ తరువాత బ్యాట్‌తో ఏమి చేయగలమో అది చేయాలి. ప్రేక్షకులు అద్భుతంగా ఉన్నారు. రెండు జట్లకు మంచి మద్దతు ఉంది. అయితే శ్రీలంకకు కొంచెం ఎక్కువ. చివరి మ్యాచ్‌లో విశ్రాంతి తర్వాత అందరూ తిరిగి జట్టులోకి వచ్చారు. అక్షర్ గాయపడ్డాడడంతో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నాం.." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్


శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.


Also Read: Narendra Modi Birthday: వచ్చే ఎన్నికల్లో కూడా BJP గెలుపు ఖాయమా? ప్రధాని నరేంద్ర మోదీ జాతకంలో కీలక విషయాలు..


Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook