India Vs Sri Lanka World Cup 2023 Highlights: ప్రపంచ కప్‌లో టీమిండియా భారీ విక్టరీని నమోదు చేసింది. మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ విధ్వంసం సృష్టించడంతో శ్రీలంకను 55 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 302 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ గెలుపులో టీమిండియా సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వగా.. శ్రీలంక ఇంటి ముఖం పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్  50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లు బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలింగ్‌లో షమీ ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టడం విశేషం. సిరాజ్ 3 వికెట్లు తీసి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన భారత్.. సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



టీమిండియా నిర్దేశించిన 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు బౌలర్లు. తొలి బంతికే పాతుమ్ నిశాంకను డకౌట్ చేసి జస్ప్రీత్ బుమ్రా వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. దిముత్ కరుణరత్నే (0), సమర విక్రమ (0) కుశాల్ మెండిస్ ఔట్ (1)లను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో శ్రీలంక 3 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 


ఆ తరువాత మహ్మద్ షమీ షో ఆరంభమైంది. 24 బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి చరిత్ అసలంకను ఔట్ చేశాడు. తరువాతి బంతికే దుషన్ హేమంత (0)ను కూడా డగౌట్‌కు పంపించాడు. దుష్మంత చమీరా (0), మ్యాథ్యూస్ (12), కుసున్ రజిత (14)లను ఔట్ చేసి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్ మధుషంక (5)ను జడేజా ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోరంగా ఓటమిపాలైంది. భారత బౌలర్ల ధాటికి ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. 


అంతకుముందు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ (4) విఫలమవ్వగా.. శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 88, 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించడంతో భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. కేఎల్ రాహుల్ (21), సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోరుకే ఔట్ అవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ (56 బంతుల్లో 82, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35) దూకుడుగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక ఐదు వికెట్లు పడగొట్టాడు. 


Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook