Ishan Kishan Ruled Out of 3rd T20I vs Sl: టీమిండియా అభిమానులకు శుభవార్త. తలకు బంతి తాకడంతో ఆసుపత్రిపాలైన యువ వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్ కోలుకున్నాడు. ధర్మశాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అతడు కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఇషాన్‌ బీసీసీఐ వైద్య బృందం పరిశీలనలో ఉండనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో ఈరోజు జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కూడా పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'శనివారం జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ తలకు గాయం అయింది. సిటీ స్కాన్ చెకప్ కోసం గత రాత్రి అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాము. సీటీ స్కాన్‌ రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇషాన్ డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పరిశీలనలో ఉండనున్నాడు. శ్రీలంకతో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ అందుబాటులో ఉండదు' అని బీసీసీఐ కార్యదర్శి జే షా ఓ మీడియా ప్రకటనలో తెలిపారు.


భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోని రెండో బంతిని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వేయగా.. ఇషాన్ కిషన్ పుల్ షాట్‌‌‌‌ ఆడాడు. బ్యాట్ అడ్వాన్స్ అవ్వడంతో.. బంతి ఇషాన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తగిలిన తర్వాత ఇషాన్ కాసేపు మైదానంలో కూర్చుండిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి ఇషాన్‌ను పరిశీలించాడు. గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో.. ఇషాన్ మ్యాచ్ కంటిన్యూ చేశాడు. లహిరు కుమార వేసిన మరుసటి ఓవర్‌లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 


ఇషాన్‌ కిషన్ ఔటైన తర్వాత బీసీసీఐ అతడిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేశారు. గాయమేమీ కాకపోవడంతో ఆసుపత్రి నుంచి వైద్యులు ఇవాళ డిశ్చార్జి చేశారు. ఇషాన్ లేకపోవడంతో రెండో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ వికెట్‌ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. మూడో టీ20కి ఇషాన్ లేకపోవడంతో ఈ రోజు కూడా సంజూ కీపర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ధర్మశాలలో ఆరంభం కానుంది. 


Also Raed: Sachin Tendulkar: గాయపడిన పక్షిని కాపాడిన సచిన్, వీడియో వైరల్


Also Read: Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook