Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిని ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 03:24 PM IST
  • రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్
  • యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న థాపా అనే భారతీయ విద్యార్థిని
  • అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీడియాకు వివరించిన థాపా
Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

Russia Ukraine War Updates: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాలుగో రోజుకి చేరింది. లొంగిపోవడానికి ఉక్రెయిన్ అంగీకరించకపోవడం.. దాడులు ఆపేందుకు రష్యా సుముఖంగా లేకపోవడంతో యుద్ధ బీభత్సం కొనసాగుతూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లోని విదేశీయుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పరాయి గడ్డపై క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థిని ఒకరు తాజాగా అంతర్జాతీయ మీడియా వియాన్‌తో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరించారు.

బంకర్‌లో తలదాచుకున్న విద్యార్థిని :

జమ్మూకశ్మీర్‌కి చెందిన థాపా (19) ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. అక్కడి ఖార్కివ్ పట్టణంలోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఆమె వైద్య విద్య అభ్యసిస్తున్నారు. సెక్యూరిటీ అలర్ట్‌తో ప్రస్తుతం ఫోన్ స్విచాఫ్ చేసుకున్న థాపా.. అంతకు కొద్ది గంటల ముందు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 23న తన స్నేహితురాలు ఇండియాకు బయలుదేరిందని.. ఎయిర్‌పోర్ట్ చేరుకునేందుకు ఆమెను బస్టాప్‌లో దిగబెట్టి తాను అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నానని థాపా తెలిపారు. అప్పటివరకూ అంతా బాగానే ఉందని.. ఆ మరుసటిరోజు తెల్లవారుజామున 5గంటలకు తన తండ్రి ఫోన్ చేసి యుద్ధ విషయం చెప్పారన్నారు.

వెంటనే కిటికీలో నుంచి బయటకు చూడగా.. బాంబు పేలుళ్ల చప్పుళ్లు వినిపించాయని.. వాట్సాప్ చెక్ చేయగా రష్యా దాడులకు సంబంధించి స్నేహితులు పంపిన వీడియోలు ఉన్నాయని తెలిపారు. సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని స్టూడెంట్ కాంట్రాక్టర్ తమను అప్రమత్తం చేశారని.. వెంటనే స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్‌లోని బంకర్‌లో తలదాచుకునేందుకు వెళ్లామని పేర్కొన్నారు.

వెళ్లే ముందు నీళ్లు, గ్లూకోజ్, ఫ్రూట్స్, చాక్లెట్స్, గ్రాసరీ తదితర వస్తువులను తీసుకెళ్లినట్లు చెప్పారు. కాలేజీ బంకర్‌లో తలదాచుకుంటున్న తమకు.. ఒకవేళ ఆహార పదార్థాలు అయిపోయినా అక్కడి సిబ్బంది చూసుకుంటున్నారని చెప్పారు. కానీ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నవారికి ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థులంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

అక్కడికి చేరుకోవాలంటే 17 గంటలు పడుతుంది..:

ప్రస్తుతం తాను ఉన్న ఖార్కివ్ పట్టణం తూర్పు ఉక్రెయిన్‌లో భాగం ఉందని.. ఇది రష్యా సరిహద్దుకు సమీపంలో ఉందని థాపా తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ ఉక్రెయిన్‌లోని విద్యార్థులను అక్కడి నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. తూర్పు భాగంలో ఉన్న తమకు సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరీ, రొమేనియాలకు చేరుకోవడానికి 17 గంటల సమయం పడుతుందన్నారు. అంత సమయం పాటు ట్రావెల్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమాత్రం సేఫ్ కాదన్నారు. 

ఉక్రెయిన్‌లో తన పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వారికి సమాచారం చేరవేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ అందమైన, శాంతియుతమైన దేశమని.. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించలేదని వాపోయారు. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో తమను కూడా వీలైనంత త్వరగా అక్కడినుంచి తరలించేందుకు భారత్ చర్యలు చేపడుతుందనే నమ్మకం ఉందన్నారు.

Also Read: Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)  

Also Read: Amazon Offers: ఆ షియోమీ మొబైల్‌పై 7 వేల ఆఫర్.. ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా! మరికొద్ది గంటలు మాత్రమే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News