Jasprit Bumrah to play India vs Sri Lanka ODI Series 2023: స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది.  గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి టీంలోకి వచ్చాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌తో బుమ్రా పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంకతో జరగనున్న 'మాస్టర్ కార్డ్' మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ.. తాజాగా బుమ్రాను భారత వన్డే జట్టులో చేర్చింది. వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ముందుగా ప్రకటించిన 15 ‍మంది సభ్యుల జట్టులో బుమ్రా పేరు లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెన్ను నొప్పి కారణంగా జస్ప్రీత్‌ బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలోనే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ అతడు ఆడలేదు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం అనంతరం బుమ్రాను బీసీసీఐ ఫిట్‌గా భావించింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. 'శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ ​కోసం భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రాను ఆల్‌ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.


మూడు టీ20లు, మూడు వన్డేల కోసం శ్రీలంక జట్టు భారత్ వచ్చిన విషయం తెలిసిందే. 2023 జనవరి 3 నుంచి జనవరి 15 వరకు మ్యాచులు జరగనున్నాయి. టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ 2023 జనవరి 3న ముంబైలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రెండో, మూడో మ్యాచ్ జనవరి 5, 7 తేదీల్లో వరుసగా పుణె, రాజ్‌కోట్‌లలో జరుగుతాయి. జనవరి 10, 12, 15 తేదీల్లో గౌహతి, కోల్‌కతా, త్రివేండ్రంలలో వన్డేలు జరుగుతాయి. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌. 



వన్డే సిరీస్‌కు భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌. 


Also Read: Rahu Transit 2023: 2023లో రాహువు సంచారం.. ఈ 4 రాశుల వారి పని ఔట్! అడుగడుగునా కష్టాలే


Also Read: Kia Cars New Price: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ కారు కొనడానికి లక్ష అదనంగా చెలించాల్సిందే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.