Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో బ్యాటర్‌గా!!
Virat Kohli Becomes 6th Indian to Score 8000 Test Runs. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Virat Kohli completes 8000 Test Runs: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ ఈ ఫీట్ అందుకున్నాడు. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోర్ 38 వద్ద కోహ్లీ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ టెస్ట్ కోహ్లీకి వందో మ్యాచ్ కావడం కూడా ఓ విశేషం.
టెస్టుల్లో 8 వేల పరుగులను పూర్తిచేసిన విరాట్ కోహ్లీ.. ఆరో భారత ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,781), వీరేందర్ సెహ్వాగ్ (8,503) కోహ్లీ కంటే ముందు ఉన్నారు. కోహ్లీ 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకుంటే.. సచిన్ 154 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో ద్రవిడ్ (158), సెహ్వాగ్ (160), గవాస్కర్ (166), లక్ష్మణ్ (201) వరుసగా ఉన్నారు.
100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత అందుకున్నాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన పాంటింగ్.. 8000 పరుగులను పూర్తి చేశాడు. 16 సంవత్సరాల తర్వాత కోహ్లీ తన 100వ టెస్టులో ఈ ఫీట్ అందుకున్నాడు. 100వ టెస్టులో సెంచరీ చేస్తాడని ఫాన్స్ అందరూ అనుకున్నా.. అది జరగలేదు. 45 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్ రూపంలో ఇంకో అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ 100 టెస్టులు ఆడారు. అయితే 100వ టెస్టులో వీరు ఎవరూ సెంచరీ చేయలేదు. 100వ టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచే సదావకాశం కోహ్లీ ముందు ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అయినా విరాట్ సెంచరీ చేయాలని ఆశిద్దాం.
Also Read: Viral Video: గాల్లోనే జింకను పట్టేసిన చిరుత.. ఆ తర్వాత ఏమైందో మీరే చుడండి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook