WI vs IND 1st Test Highlights: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-25) రేసులో టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా కరేబియన్ జట్టుపై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్' లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 421/5 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు  271 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 171,  రోహిత్ శర్మ 103, విరాట్ కోహ్లీ 76, జడేజా 37 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మెుదలుపెట్టిన విండీస్..అశ్విన్ బౌలింగ్ ధాటికి 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో కరేబియన్ జట్టు 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. 


Also Read: India Vs West Indies Updates: తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!


తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి విండీస్ ను దెబ్బకొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. మరోవైపు జడేజా కూడా రాణించడంతో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలుత త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (7)ను జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో  విండీస్ పతనం ప్రారంభమైంది. కాసేపటికే బ్రాత్‌వైట్ (7) అశ్విన్‌కు చిక్కాడు. టీ విరామ సమయానికి 27/2తో నిలిచిన వెస్టిండీస్‌ చివరి సెషన్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరి ఐదు వికెట్లు అశ్విన్ కే దక్కడం విశేషం. అతిథ్య జట్టు ఆటగాళ్లలో అథనేజ్‌ 28 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ 7, జడేజా 2 వికెట్లు తీశారు. మరో వికెట్ సిరాజ్ కు దక్కింది. 


Also Read: Yashasvi Jaiswal: వెస్టిండీస్‌ బౌలర్‌‌ను బూతులు తిట్టిన యశస్వి జైస్వాల్.. వీడియో వైరల్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook