Isha Kishan First Test Run: తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. డబ్ల్యూటీసీ (2023-25) సైకిల్‌ను విజయంతో ప్రారంభించింది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (171) అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీతో కదం తొక్కాడు. విరాట్ కోహ్లీ (76) అర్ధసెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి క్రీజ్‌లో రవీంద్ర జడేజా (37), ఇషాన్ కిషన్ (1) ఉన్నారు. ఇషాన్ ఒక పరుగు చేసిన వెంటనే రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలా చేయాలనుకుంటే.. కోహ్లీ అవుట్ అయినప్పుడే చేయాల్సిందని అంటున్నారు.


అయితే ఈ విషయంపై హిట్‌ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి పరుగు కూడా విలువైందని అన్నాడు. తాము మొదట బౌలింగ్‌ను అద్భుతంగా ప్రారంభించామని.. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే ఆలౌట్‌ చేశామన్నాడు. బ్యాటింగ్‌లో 400కిపైగా పరుగులు చేయడంతో తమ బౌలర్లకు మరింత స్వేచ్ఛ లభించిందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారని అన్నాడు. ముందుగా విరాట్ ఔట్ అయినప్పుడే డిక్లేర్ చేయాలని అనుకున్నామని.. అయితే ఇషాన్ కిషన్ తన తొలి టెస్ట్‌లో ఖాతా ఓపెన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కాసేపు వెయిట్ చేసినట్లు చెప్పాడు. 20 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. తొలి పరుగు చేసిన వెంటనే రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 


యశస్వి జైస్వాల్ తన అరంగేట్రం టెస్టులోనే అద్భుత సెంచరీతో ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. 387 బంతుల్లో 171 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 130 రన్స్ చేయగా.. భారత్ 421 పరుగులు చేసింది. అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్ కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.  


Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం  


Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి