IND vs WI 3rd ODI Playing 11 is Out: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో భారత్ ఈ మ్యాచులో ప్రయోగాలు చేస్తోంది. లోకేష్ రాహుల్, యుజ్వేంద్ర చహల్, దీపక్ హుడా స్థానాల్లో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్,  కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. మరోవైపు విండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఆ జట్టు సారథి నికోలస్ పూరన్ చెప్పాడు. అకేల్ హోసేన్ బదులుగా హేడెన్ వాల్ష్ మ్యాచ్ ఆడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో వన్డేలో భాగంగా టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కరోనా భారిన పడిన గబ్బర్.. ఫిట్‌నెస్‌ సాధించడంతో మూడో వన్డేలో ఓపెనర్‌గా రానున్నాడు. ఇక విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. దాంతో పూరన్‌ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. భారత్ ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. మూడో వన్డే కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్‌ చేయాలని చూస్తోంది. మరోవైపు చివరి మ్యాచ్ అయినా గెలిచి పరుగు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది. 


తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 
వెస్టిండీస్: షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్, కెమర్ రోచ్. 



Also Read: Viral Video: 'పుష్ప' మేనియా తగ్గట్లేదుగా.. ఆఖరికి బుడ్డోడు కూడా అల్లు అర్జున్ హుక్ స్టెప్ ట్రై చేస్తుండు!!


Also Read: IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో మూడో వన్డే.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook