India Vs Zimbabwe T20 Series: టీ20 వరల్డ్ కప్ గెలుపుతో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అభిమానులు కూడా దేశవ్యాప్తంగా భారీగా సంబరాలు చేసుకున్నారు. ఇక జింబాబ్వే టూర్‌కు భారత్ పయణమైంది. ఈ సిరీస్‌ నుంచి కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోగా.. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీమ్‌లోని ఆటగాళ్లు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయగా.. తాజాగా జట్టులో సెలెక్టర్లు మార్పులు చేశారు. తొలి రెండు మ్యాచ్‌లకు ఈ ముగ్గురు ఆటగాళ్లు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ముగ్గురి స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..


జింబాబ్వే టూర్‌లో టీమిండియా 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సంజూ శాంసన్, శివమ్ దూబే యశస్వి జైస్వాల్ T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు. వెస్టిండీస్‌లో తుఫాను కారణంగా వారు ఇంకా భారత్‌కు తిరిగి రాలేదు. స్వదేశానికి వచ్చిన అనంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు హరారేకు బయలుదేరనున్నారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియా ఆటగాళ్లు భారత్‌కు బయలుదేరి రావాల్సి ఉంది. అయితే బెరిల్ తుఫాను కారణంగా టీమ్ మొత్తం హోటల్‌లో ఇరుక్కుపోయింది. బుధవారం సాయంత్రంలోగా ఆటగాళ్లు ఢిల్లీకి చేరుకోవచ్చని చెబుతున్నారు. వారి కోసం బీసీసీఐ చార్టర్‌ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


భారత్ Vs జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..


==> తొలి టీ20– శనివారం, జూలై 6
==> రెండో టీ20– ఆదివారం, జూలై 7
==> మూడో టీ20– బుధవారం, జూలై 10
==> నాలుగో టీ20– శనివారం, జూలై 13
==> ఐదో టీ20– ఆదివారం, జూలై 14


తొలి, రెండో టీ20 మ్యాచ్‌లకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా.


Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter