Suryakumar Yadav Meets UP CM Yogi Adityanath after IND vs NZ 2nd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో హార్దిక్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 100 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ (26 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులే చేసింది. ఈ విజయంతో టీమిండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టీ20 మ్యాచ్ చూసేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎకానా క్రికెట్ స్టేడియంకు వచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు యోగి ఆదిత్యనాథ్ ఆటగాళ్లతో సమావేశమయ్యారు. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పుష్పగుచ్చం ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబందించిన ఫొటోను యూపీ సీఎం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో నెట్టింట చక్కర్లు కొట్టింది. నేడు భారత స్టార్ క్రికెటర్, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశాడు.


సోమవారం ఉదయం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను అతని అధికారిక నివాసంలో సూర్యకుమార్ యాదవ్ కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సోషల్ మీడియాలో సూర్యకుమార్ ఫొటోను పంచుకున్నారు. 'లక్నోలోని అధికారిక నివాసంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ సూర్యకుమార్ యాదవ్ (Mr. 360°)తో' అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.  



సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్‌లో పరుగులు చేస్తూనే ఉన్నాడు. సూర్య పొట్టి ఫార్మాట్‌లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంక్‌లో ఉన్నాడు. లక్నోలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.


Also Read: SuryaKumar Yadav: ఆ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్‌ కామెంట్స్!  


Aslso Read: Hardik Pandya: ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను.. హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయంపై గౌతమ్ గంభీర్‌ అసహనం!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.