Gautam Gambhir fires on Hardik Pandya over Yuzvendra Chahal Overs: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్స్ పడగొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసి గెలుపొందింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) టాప్ స్కోరర్.
రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు వేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను నాలుగో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపి టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు. తొలి ఓవర్లో మెయిడిన్ వికెట్ తీసిన చహల్.. రెండో ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. యూజీ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన యజువేంద్ర చహల్‌కు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో ఓవర్ ఇవ్వలేదు. అదే సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ దీపక్ హుడాకు మాత్రం నాలుగు ఓవర్లు ఇచ్చాడు. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. హార్దిక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టీ20 ఫార్మాట్లో నంబర్ 1 స్పిన్నర్ అయిన చహల్‌తో పూర్తి కోటా బౌలింగ్ చేయనివ్వకపోవడం హార్దిక్ తీసుకున్న చెత్త నిర్ణయం అని పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఇలాంటి వికెట్‌పై ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో అర్ధం కావడం లేదు. నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. టీ20 ఫార్మాట్లో యజువేంద్ర చహల్ టీమిండియాకు నంబర్ వన్ స్పిన్నర్. అందులో ఫిన్ అలెన్ లాంటి ముఖ్యమైన వికెట్‌ను పడగొట్టాడు. అలాంటి బౌలర్‌కు కేవలం రెండు ఓవర్లు ఇవ్వడం ఏంటి. బౌలింగ్ కోటా పూర్తి చేయనివ్వకపోవడం చెత్త నిర్ణయం అనిపిస్తోంది' అని పేర్కొన్నాడు.
Also Read: Yuzvendra Chahal: భువనేశ్వర్ కుమార్ రికార్డు బద్దలు.. తొలి బౌలర్‌గా యుజ్వేంద్ర చహల్!
Also Read: Shubman Gill: శుబ్‌మన్ గిల్ టీ20లకు పనికిరాడు.. అతడిని తుది జట్టులో తీసుకురండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.