ఆసియా కప్ 2018 : పాక్ ఆటగాళ్లకు రోహిత్ శర్మ కితాబు
ఆసియా కప్ : పాక్ ఆటగాళ్లకు కితాబిచ్చిన రోహిత్ శర్మ
ఈ నెల 15 నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో అక్కడకు చేరుకున్న భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, అఫ్ఘనిస్తాన్ జట్ల కెప్టేన్స్ అందరూ ఇవాళ అక్కడ జరిగిన ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టేన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో ఆడనుండటం తమను ఎగ్జైటింగ్‌కి గురిచేస్తోందని, పాక్‌తో ఆట ఎప్పుడైనా ఆసక్తికరంగానే ఉంటుందని అన్నాడు. తమ దృష్టి అంతా కేవలం ఆటమీదే ఉందని స్పష్టంచేస్తూ.. పాక్ ఆటగాళ్లు సైతం క్రికెట్ బాగా ఆడగలరని కితాబిచ్చాడు.
ఈ నెల 15న ఈ ఆసియ కప్ టోర్నీ ప్రారంభం కానుండగా ఈ నెల 19న భారత్, పాకిస్తాన్ తలపడనున్న మ్యాచ్‌పైనే క్రికెట్ ప్రియుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. రోహిత్ శర్మ కితాబిచ్చిన సమయంలో పాక్ కెప్టేన్ సర్ఫరాజ్ అహ్మెద్ కూడా అతడి పక్కనే ఉన్నాడు.