India Predicted Playing XI vs Sri Lanka 3rd ODI: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం (జనవరి 15) తిరువనంతపురంలో జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంటే.. చివరి వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. మూడో వన్డే  నేపథ్యంలో భారత్ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) శ్రీలంకతో జరిగే మూడో వన్డే తుది జట్టులోకి రానున్నారు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాదిన ఇషాన్‌కు తొలి రెండు వన్డేల్లో అవకాశం దక్కలేదు. శ్రీలంకతో మూడో టీ20లో సెంచరీతో చెలరేగిన సూర్యకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. దాంతో మేనేజ్మెంట్, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో నామమాత్రమైన చివరి వన్డేలో ఈ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill), శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)ల స్థానాల్లో ఇషాన్‌, సూర్య ఆడనున్నారు. తొలి వన్డేలో గిల్ హాఫ్ సెంచరీ చేసినా.. రెండో వన్డేలో విఫలమయ్యాడు. ఇక అయ్యర్ రెండు మ్యాచుల్లో పెద్దగా రన్స్ చేయలేదు. 


ఓపెనర్‌లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్‌ కిషన్ ఆడతారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) బరిలోకి దిగనుండగా.. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌ 4, 5లో ఆడతారు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆడతారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ పేస్ కోటాలో బరిలోకి దిగుతారు. యుజ్వేంద్ర చహల్ ఫిట్‌నెస్‌ సాధించడంతో కుల్దీప్ యాదవ్ ఆడడం అనుమానంగానే ఉంది. రెండో వన్డేలో అద్భుత ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ వైపే జట్టు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. 


భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. 


Also Read: Jupiter Rise 2023: అరుదైన ధన రాజయోగం.. ఈ 3 రాశుల వారికి 'ప్రతిరోజూ పండగే'! ఇంటి నిండా నోట్ల కట్టలే  


Also Read: Best Selling 7 Seater Car: చౌకైన 7 సీటర్ కారు.. ఆల్టో, వ్యాగన్ఆర్‌కి బదులుగా ఈ కారునే కొంటున్నారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.