BCCI Selection Committee announce India Squad for WTC Final 2023 without Chief Selector: ఐపీఎల్ 2023 అనంతరం భారత జట్టు‌ కీలక ఐసీసీ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్‌లోని లండన్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండలి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) కోసం ఈ నెల చివరలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయి సభ్యులు లేకుండానే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టింగ్ ఆపరేషన్స్‌లో బోర్డు అంతర్గత వ్యవహారాలు చెప్పిన అనంతరం చేతన్ శర్మ తప్పుకున్నాడు. దాంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ నియమితులు అయ్యారు. అయితే చేతన్ శర్మ స్థానాన్ని మాత్రం ఇప్పటివరకు భర్తీ చేయలేదు. 5 సభ్యులు ఉండాల్సిన సెలెక్షన్ కమిటీ ప్రస్తుతం నలుగురు సభ్యులతోనే బాధ్యతలు నిర్వర్తిస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 20222, ఆసియా కప్ 2022లకు ఈ నలుగురు సభ్యులే భారత జట్లను ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఆడే భారత జట్టును (India Squad WTC Final 2023) కూడా ఈ నలుగురు సభ్యుల కమిటీనే ఎంపిక చేస్తుందని బీసీసీఐ బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. 


'బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో చేతన్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. కొత్త సెలెక్టర్‌ను తీసుకోవాల్సిన తొందర ఇప్పుడు లేదు. మంచి టెస్ట్ జట్టు ఉంది. ప్రస్తుతం ఉన్న సెలెక్టర్లకు జట్టు ఎంపిక తెలుసు. ఆటగాళ్ల గాయాలు, భర్తీ విషయాలపై పూర్తి అవగాహన ఉంది. అత్యుత్తమ భారత జట్టును వారు ప్రకటిస్తారు' అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఆడే జట్లను ప్రకటించేందుకు మే 7 వరకు సమయం ఉంది. ఇక మే 22 వరకు జట్టులో మార్పులు కూడా చేసే వెసులు బాటుని ఐసీసీ కల్పించింది.


గాయపడిన శ్రేయాస్ అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఐపీఎల్ 2023లో సూర్య ప్రస్తుత ఫామ్‌ బాగాలేదు. మరోవైపు అజింక్య రహానే మాత్రం దుమురేపుతున్నాడు. ఐపీఎల్ 2023 ముందు జరిగిన రంజీ ట్రోఫీలో రహానే 7 మ్యాచ్‌లు ఆడి 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. దాంతో బీసీసీఐ సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ పిచ్‌లపై రహానేకు అనుభవం జట్టుకి కలిసిరానుందని కూడా బీసీసీఐ భావిస్తోంది.  


Also Read: RR vs LSG: లక్నోతో రాజస్థాన్‌ మ్యాచ్.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించనున్న యుజ్వేంద్ర చహల్‌!  


Aslo Read: Arjun Tendulkar Maiden IPL Wicket: ఆడింది రెండు మ్యాచ్‌లే.. తండ్రి సచిన్‌నే అధిగమించిన అర్జున్‌ టెండూల్కర్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.