ICC World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్‌లో మరో మెగా టోర్నీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇండియా ఆతిధ్యం వహిస్తున్న ఐసీసీ ప్రపంచకప్ 2023 అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. దీర్ఘకాలంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఐసీసీ ప్రపంచకప్ 2023కు టీమ్స్ జాబితా సిద్దమైంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ చరిత్రలో అతిపెద్ద టోర్నీగా భావించే ఐసీసీ ప్రపంచకప్ 2023ను ఈసారి ఇండియా ఒక్కటే ఆతిధ్యం ఇస్తోంది. గతంలో ఇండియా 1987, 1996, 2011లో మూడుసార్లు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి నిర్వహించింది. ఈసారి ఒంటరిగా నిర్వహిస్తోంది. ఐసీసీ ప్రపంచకప్ ఇప్పటి వరకూ 12 సార్లు జరిగింది. తొలి ప్రపంచకప్ 1975లో ఇంగ్లండ్‌లో జరగగా అప్పట్లో 8 జట్లు పాల్గొన్నాయి. వెస్ట్‌ఇండీస్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి తొలి ప్రపంచకప్ అందుకుంది. రెండవ ప్రపంచకప్‌ను కూడా వెస్ట్ ఇండీస్ గెల్చుకోగా, మూడవది మాత్రం అందరికీ షాక్ ఇస్తూ అప్పట్లో క్రికెట్ పసికూనగా భావించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని ఇండియా గెల్చుకుంది. 


1987లో తొలిసారి ప్రపంచకప్ ఇంగ్లండ్‌కు వెలుపల ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో తొలిసారి 50 ఓవర్ల మ్యాచ్ జరిగింది. అప్పటి వరకూ 60 ఓవర్ల మ్యాచ్ జరిగేది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ కలిసి నిర్వహించగా 1996లో మరోసారి ఇండియా-పాకిస్తాన్ దేశాలు శ్రీలంకతో కలిసి నిర్వహించాయి. ఆ తరువాత తిరిగి ఇంగ్లండ్‌లో జరిగింది. నాలుగేళ్ల తరువాత దక్షిణాఫ్రికా తొలిసారి జింబాబ్వే, కెన్యాలతో కలిసి ప్రపంచకప్ నిర్వహించాయి. 2007లో తొలిసారి వెస్ట్ ఇండియాస్ ఐసీసీ ప్రపంచకప్‌కు ఆతిధ్యమిచ్చింది. 


2019లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాలు నిర్వహించింది. ప్రపంచకప్‌ను ఎక్కువసార్లు గెల్చుకున్న జట్టుగా ఆస్ట్రేలియా ఖ్యాతినార్జించింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ 5 సార్లు ప్రపంచకప్ గెల్చుకోగా వెస్ట్‌ఇండీస్, ఇండియాలు రెండేసి సార్లు కప్ గెల్చుకున్నాయి. ఇక పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాలు ఒక్కోసారి ప్రపంచకప్ టైటిల్ సాధించాయి. 


ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ దశలో మొత్తం పది జట్లు ఒకరితో ఒకరు పోటీ పడతాయి. ఒక్కొక్క విజయానికి రెండేసి పాయింట్లు లభిస్తాయి. ఏ విధమైన ఫలితం లేకుండా మ్యాచ్ ముగిస్తే చెరో పాయింట్ లభిస్తుంది. రౌండ్ రాబిన్ దశ పూర్తయిన తరువాత మిగిలిన 4 జట్లు సెమీ ఫైనల్స్‌లో ప్రవేశిస్తాయి. ఐసీసీ ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్‌కు ప్రధాన మార్గం సూపర్ లీగ్ ఉంటుంది. 


ఇప్పటి వరకూ ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఖనిస్తాన్, దక్షిణాఫ్రికా దేశాలు ఐసీసీ ప్రపంచకప్ 2023కు క్వాలిఫై అయ్యాయి. మరోవైపు ఐర్లండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, వెస్ట్‌ఇండీస్, జింబాబ్వే, నేపాల్, ఒమన్, స్కాట్లండ్, యూఏఈ , యూఎస్ఏలు చివరి రెండు స్థానాల కోసం జూన్-జూలైలో జరిగే క్వాలిఫయర్ రౌండ్‌లో పాల్గొననున్నాయి. 


ఐసీసీ ప్రపంచకప్ 2023కు క్వాలిఫై టీమ్స్


ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మొత్తం 8 జట్లు


ఐసీసీ ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ జట్ల జాబితా


ఐర్లండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, జింబాబ్వే, నేపాల్, ఒమన్, స్కాట్లండ్, యూఏఇ, యూఎస్ఏలు చివరి రెండు స్థానాలకై పోటీ పడతాయి.


Also read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook