ఎప్పటి లాగే తనపై వస్తున్న విమర్శలకు ధోనీ బ్యాట్ తోనే బదులిచ్చాడు. తొలి వన్డేలో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన ధోనీ.. రెండో వన్డేలో మెరువు వేగంతో పరుగులు రాబట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు . కేవలం 54 బంతులు ఎదుర్కొని 55 పరుగుల చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చి... జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డేలో ధోనీపై విమర్శల వర్షం


తొలి వన్డేలో హాఫ్ సెంచరీ (51) చేసేందుకు ఏకంగా 96 బంతులు ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలవడంతో అందరూ ధోనీని ముద్దాయిగా చూశారు. ఆ మ్యాచ్ లో తక్కువ స్కోర్లకే పెలిలియన్ బాటపట్టిన వారందరినీ పక్కన పెట్టి..జట్టు పరాజయానికి ధోనీ ఒక్కడే కారణమంటూ విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో ధోనీపై పలువురు అభిమానులు ట్వీట్ల రూపంలో సెటైర్ల సంధించారు. 


ధోనీపై వచ్చిన ట్వీట్ ఇవే...
 ధోనీ వన్డేలకి పనికి రాడు.. టెస్టులకి పనికొస్తాడంటూ.. సెటైర్లు
‘‘ధోనీ ఔట్ అయ్యాడు.. ఇప్పుడు మనకు గెలిచే అవకాశం ఉంది’’ 
‘‘రిషబ్ పంత్ వన్డేలు.. ధోనీ టెస్ట్‌లు ఆడాలి.. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది’’


ధోనీనా మజాకా..


ఈ మాత్రం విమర్శలకు కుంగిపోతే అతను ధోనీ ఎందుకౌతాడు..విమర్శల పట్ల మౌనం దాల్చిన మేధావి క్రికెటర్ ధోనీ..ఈ రోజు తన బ్యాట్ తో విమర్శకుల నోళ్లు మూయించాడు. కేవలం 54 బంతులు ఎదుర్కొని 55 పరుగుల చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు...ఫలితంగా టీమిండియా అద్భత విజయం సొంతం చేసుకుంది. ... ధోనీనా మజాకా..