India Vs Bangladesh 1st Test Highlights: బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. తొలి టెస్టులో శుభారంభం చేసింది. చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు 513 పరుగుల లక్ష్యం విధించగా.. ఆ జట్టు 324 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), రిషబ్ పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పరుగలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయింది. తైజుల్ ఇస్లామ్, మెహిదీ హాసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్ల తీశారు.


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్ల ఆటాడుకున్నారు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించారు. దీంతో 150 పరుగులకే ఆతిథ్య జట్టు కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ మూదు వికెట్లు తీసి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది.  


బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. భారత్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపించింది. శుభ్‌మన్‌ గిల్ (110), పుజారా (102) సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇది శుభ్‌మన్ గిల్‌కు తొలి టెస్ట్ సెంచరీ. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేజార్చుకున్న పుజారా.. ఈసారి ఆ లోటు తీర్చుకున్నాడు. పుజారా సెంచరీ తరువాత 258 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. 


513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. దీటుగానే జవాబిచ్చింది. బంగ్లా ఓపెనర్లు తొలి వికెట్‌కు 124 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జాకీర్ హసన్ (100), నజ్ముల్ హుస్సేన్ శాంటో (67), కెప్టెన్ షకీబుల్ హాసన్ (84) పరుగులతో బంగ్లాను గట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. చివరకు 324 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4, కుల్దీప్ యాదవ్ 3, సిరాజ్, అశ్విన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఈ నెల 22 నుంచి రెండో టెస్ట్ ఆరంభంకానుంది.


Also Read: Bilawal Bhutto Zardari: బిలావల్ భుట్టో తలను తీసుకొచ్చిన వ్యక్తికి రూ.2 కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్


Also Read: IND Vs AUS: ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన భారత్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook