IND vs BAN: విరాట్ కోహ్లీ పొరపాటు.. సూపర్ క్యాచ్ అందుకున్న రిషబ్ పంత్
India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
India vs Bangladesh 1st Test Day 4: భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ చిట్టగాంగ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్భుతంగా ఆరంభించారు. తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ఉమేష్ యాదవ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. అయితే విరాట్ కోహ్లి క్యాచ్ మిస్ చేసినా రిషబ్ పంత్ సూపర్‌గా క్యాచ్ అందుకున్నాడు.
నాలుగో రోజు ఆటను బంగ్లాదేశ్ జట్టు 42 పరుగులతో ఆరంభించింది. బంగ్లా ఓపెనర్లు తొలి వికెట్‌కు 124 పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బంగ్లాను తొలి దెబ్బ తీశాడు. ఈ ఓవర్ తొలి బంతి నేరుగా నజ్ముల్ హుస్సేన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్ వద్ద నిలబడిన విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లింది. బంతి విరాట్ చేతికి తగిలి గాల్లో కొంచెం ఎత్తులో గాల్లోకి లేవగా.. పక్కన ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టేశాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఇన్నింగ్స్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలోని పిచ్‌పై నాల్గో రోజు బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ నజ్ముల్ హొస్సేన్ శాంటో గొప్పగా పోరాడాడు. 156 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. జాకీర్ హసన్‌తో కలిసి బంగ్లాను గట్టేక్కించేందుకు ప్రయత్నించాడు.
శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా సెంచరీల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మూడో రోజు బంగ్లాదేశ్ ముందు టీమిండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ 10 ఫోర్లు, మూడు లాంగ్ సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. పుజారా 130 బంతుల్లో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం బంగ్లా మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బంగ్లా విజయానికి ఇంకా 322 పరుగులు చేయాల్సి ఉంది. ఉమేష్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
Also Read: Pension Scheme: ప్రతి నెల నేరుగా రూ.5 వేలు ఖాతాల్లోకి.. ఈ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..!
Also Read: Rohit Sharma: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ ఈజీ బ్యాక్.. ఆ ప్లేయర్‌పై వేటు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి