Rohit Sharma: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ ఈజీ బ్యాక్.. ఆ ప్లేయర్‌పై వేటు..!

Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ కోలుకున్నాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. హిట్‌మ్యాన్‌ రాకతో ఎవరిపై వేటు పడనుంది..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 12:12 PM IST
  • గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ
  • రెండో టెస్టులో బరిలోకి హిట్‌మ్యాన్
  • ఎవరిపై వేటు పడనుంది..?
Rohit Sharma: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ ఈజీ బ్యాక్.. ఆ ప్లేయర్‌పై వేటు..!

Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్. హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నెట్స్‌లో శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. రెండో టెస్టులో తిరిగి మైదానంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే హిట్‌మ్యాన్ టీమ్‌లోకి వస్తే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనేది ప్రశ్నగా మారింది. శుభ్‌మన్ గిల్ లేదా కేఎల్ రాహుల్ ఔట్ అవ్వాల్సి ఉంటుంది.

చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ 20, కేఎల్ రాహుల్ 22 పరుగులు చేసి ఔట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 23 రన్స్ మాత్రమే చేయగా.. శుభ్‌మన్ తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే రెండో మ్యాచ్‌లో రోహిత్ ఆడితే.. శుభ్‌మన్ గిల్ పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ఓపెనర్‌గా జట్టుకు మొదటి ఎంపిక కావచ్చు. 

మాజీ క్రికెటర్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. శుభ్‌మన్‌ గిల్ సెంచరీతో బాగా రాణిస్తున్నాడని అన్నాడు. అయితే రోహిత్ పునరాగమనంతో కేఎల్ రాహుల్‌ను డ్రాప్ చేయడానికి టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టపడదన్నాడు. రాహుల్ ఎక్కువ పరుగులు చేయకపోయినా.. కేఎల్ రాహుల్ టీమ్‌లో ఉంటాడని అన్నాడు. రెండో టెస్టుకు శుభ్‌మన్ గిల్‌ రిజర్వ్ బెంచ్‌పై కూర్చొవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ 73 పరుగులతో చేయగా.. ఆ తరువాత వరుసగా విఫలమవుతున్నాడు. రెండో వన్డే మ్యాచ్‌లో 14 పరుగులు, మూడో మ్యాచ్‌లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి టెస్టులో కూడా రాహుల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. అతని పేలవమైన ప్రదర్శన కారణంగా విమర్శల పాలవుతున్నాడు. 

బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బొటన వేలికి తీవ్ర గాయమైంది. ఈ గాయం కారణంగా అతను చివరి వన్డేకు కూడా దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. 

Also Read: Death Day Invitation: బతికుండగానే మరణదిన వేడుకలు.. మాజీ మంత్రి ఆహ్వాన పత్రిక వైరల్  

Also Read: Tekkali Cheating Case: 65 రూపాయలకే లీటర్ డీజిల్.. ట్యాంక్‌లు ఫుల్ చేయించి.. చివరికి సూపర్ ట్విస్ట్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News