India Squad for First Two Tests against England: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. యంగ్ ప్లేయర్ ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) తొలిసారి టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించాడు. ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కేఎస్ భరత్ కూడా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ తరువాత గాయంతో జట్టుకు దూరమైన షమీ.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా తప్పుకున్నాడు. అవేష్‌ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో స్పిన్ విభాగం బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అవేష్‌ ఖాన్‌తో కూడిన పేస్ విభాగం ప్రత్యర్థిని భయపెట్టేందుకు రెడీ అవుతోంది. 


కేఎల్ రాహుల్‌కు ఇద్దరు బ్యాకప్ వికెట్ కీపర్లను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ధృవ్ జురెల్ తొలిసారి జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇండియా ఎ జట్టులో జురెల్ ఆకట్టుకున్నాడు. 69 పరుగులతో రాణించాడు. గతేడాది విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లలో 46 సగటుతో 790 పరుగులతో రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత్‌కు ఇది మూడో సిరీస్. వెస్టిండీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకోగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించారు. 


తొలి రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.


Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  


Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook