Indian cricketers tested positive for Covid-19 in UK: ఇటీవల శ్రీలంకతో సిరీస్ అనంతరం ఇంగ్లాండ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఇటీవల ఇద్దరు క్రికెటర్లు బారిన పడ్డారు. అయితే ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా యూకేలో ఉంది. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో ఉన్న జట్టులో ఆటగాళ్లకు జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇందులో ఓ క్రికెటర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నాడని అధికారులు తెలిపారు. మరో ఆటగాడికి జులై 18న కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పరీక్షలలో ఏ లక్షణాలు (Asymptomatic) లేవని తేలడం టీమిండియాకు ఊరట కలిగిస్తోంది. అంతా ఓకే అయితే ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ (India vs England Test Series) విజయవంతంగా జరగనుంది.


Also Read: SL vs IND 2021: Hardik Pandya బౌలింగ్ చేస్తే Virat Kohli జాబ్ ఈజీ: అజిత్ అగార్కర్


టీమిండియా జట్టు జులై 20 నుంచి 22 తేదీల మధ్య కౌంటీ ఛాంపియన్‌షిప్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోరిక మేరకు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఈ వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తోంది. కరోనా నుంచి ఓ భారత క్రికెటర్ కోలుకోగా, మరో ఆటగాడు సైతం ఐసోలేషన్ పూర్తి చేసుకుని జులై 18న నెగెటివ్‌గా ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అతడు సైతం జట్టుతో చేరి మ్యాచ్‌లు ఆడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also Read; MS Dhoni New Look: చిన్ననాటి స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్, సోషల్ మీడియాలో ఫొటో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook